LOADING...
Reliance Jio: గూగుల్-జియో భారీ ఆఫర్: జెమిని 2.5 ప్రో ప్లాన్ 18 నెలలు ఫ్రీ!
గూగుల్-జియో భారీ ఆఫర్: జెమిని 2.5 ప్రో ప్లాన్ 18 నెలలు ఫ్రీ!

Reliance Jio: గూగుల్-జియో భారీ ఆఫర్: జెమిని 2.5 ప్రో ప్లాన్ 18 నెలలు ఫ్రీ!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 31, 2025
08:18 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత మార్కెట్లో గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్, దేశీయ దిగ్గజం రిలయన్స్ జియో తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచుకునే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో ఇరు సంస్థలు వినియోగదారులకు భారీ సర్‌ప్రైజ్‌ ఇచ్చాయి. తాజా ప్రకటన ప్రకారం, రూ.35,100 విలువైన గూగుల్ ఏఐ ప్రో ప్లాన్,అలాగే జెమిని యాప్‌లోని జెమిని 2.5 ప్రో మోడల్ ను జియో కస్టమర్లకు 18 నెలల పాటు పూర్తిగా ఉచితంగా అందించనున్నారు. ఈ ప్రత్యేక ఆఫర్ అక్టోబర్ 30 నుంచి అమల్లోకి రానుంది.ప్రారంభ దశలో ఈ ఆఫర్‌ను 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల కస్టమర్లకు మాత్రమే అందిస్తారు. అయితే,ఇది అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్ ఉన్న యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది.

వివరాలు 

యూజర్లకు ప్రత్యేక ఫీచర్లు

అనంతరం ఈ ఆఫర్‌ను దశలవారీగా ఇతర జియో వినియోగదారులకు కూడా విస్తరించనున్నట్లు సంస్థలు వెల్లడించాయి. గూగుల్ ఏఐ ప్రో ప్లాన్ ద్వారా జియో యూజర్లు జెమిని యాప్‌లోని జెమిని 2.5 ప్రో ఏఐ మోడల్ ను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లకు 2టీబీ క్లౌడ్ స్టోరేజ్, వియో 3.1 వీడియో జనరేటర్, నానో బనాన ఇమేజ్ జనరేషన్ వంటి ప్రత్యేక ఫీచర్లు లభిస్తాయి. అదనంగా,జెమిని కోడ్ అసిస్ట్,నోట్‌బుక్ ఎల్ఎం,జీమెయిల్,గూగుల్ డాక్స్ వంటి సేవల్లోనూ జెమిని ఫీచర్లను ఉపయోగించే అవకాశం ఉంటుంది.

వివరాలు 

2టీబీ క్లౌడ్ స్టోరేజ్ 

2టీబీ క్లౌడ్ స్టోరేజ్ సదుపాయం ద్వారా యూజర్లు తమ ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ ఫోటోస్, జీమెయిల్, గూగుల్ డ్రైవ్,అలాగే వాట్సాప్ చాట్ బ్యాకప్ వంటి అవసరాల కోసం సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలనుకునే యూజర్లు మైజియో యాప్ ద్వారా నేరుగా గూగుల్ ఏఐ ప్రో ప్లాన్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు.