Google upgrades Chrome: క్రోమ్‌లో అదిరే అప్డేట్.. అందుబాటులో స్ప్లిట్ వ్యూ, పీడీఎఫ్ ఎడిటింగ్ ఫీచర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ రంగంలో మరో కీలక అప్‌డేట్ వచ్చేసింది. గూగుల్ తన క్రోమ్ బ్రౌజర్‌కు భారీ అప్డేట్ ప్రకటించింది. ఈ కొత్త అప్డేట్‌లో స్ప్లిట్ వ్యూ, బ్రౌజర్‌లోనే పీడీఎఫ్ ఎడిటింగ్ టూల్స్,అలాగే గూగుల్ డ్రైవ్‌కు నేరుగా సేవ్ చేసే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఏఐ ఆధారిత బ్రౌజర్లు మార్కెట్‌లో పెరుగుతున్న పోటీ నేపథ్యంలో గూగుల్ ఈ ఫీచర్లతో మల్టీటాస్కింగ్, డాక్యుమెంట్ హ్యాండ్లింగ్‌ను మరింత సులభం చేయాలని ప్రయత్నిస్తోంది. స్ప్లిట్ వ్యూ ఫీచర్ ద్వారా ఒకే విండోలో రెండు వెబ్ పేజీలను పక్కపక్కన ఓపెన్ చేసుకోవచ్చు. ట్యాబ్‌ను డ్రాగ్ చేసి లేదా రైట్ క్లిక్ ద్వారా ఈ మోడ్‌లోకి వెళ్లొచ్చు.దీంతో ఒకవైపు వీడియో చూస్తూ మరోవైపు నోట్స్ తీసుకోవడం లేదా రెండు సైట్లలోని సమాచారం పోల్చడం సులభమవుతుంది.
వివరాలు
జెమిని ఏఐ అసిస్టెంట్‌ను క్రోమ్‌లో ఇంటిగ్రేట్ చేసిన గూగుల్
అవసరమైతే రైట్ క్లిక్‌తో బయటకు రావచ్చు. ఇకపై పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ చేసి వేరే యాప్‌లో ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా, క్రోమ్‌లోనే హైలైట్ చేయడం, నోట్స్ పెట్టడం వంటి పనులు చేయవచ్చు. అదేవిధంగా పీడీఎఫ్ ఫైళ్లను కంప్యూటర్‌లో సేవ్ చేయకుండా నేరుగా గూగుల్ డ్రైవ్ అకౌంట్‌లో అప్లోడ్ చేసే సౌకర్యం కూడా ఇచ్చింది. ఈ ఫీచర్లు ఏఐ ఆధారితమైనవి కాకపోయినా, మార్కెట్‌లో పెరుగుతున్న పోటీకి గూగుల్ సమాధానంగా చూస్తున్నారు నిపుణులు. ఇప్పటికే గూగుల్ తన జెమిని ఏఐ అసిస్టెంట్‌ను క్రోమ్‌లో ఇంటిగ్రేట్ చేసింది.
వివరాలు
క్రోమ్‌బుక్ వినియోగదారులకు కూడా జెమిని ఆధారిత ఫీచర్లు
ఓపెన్‌ఏఐ, పర్ప్లెక్సిటీ ఏఐ వంటి సంస్థలతో పోటీ పడేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వెర్టికల్ ట్యాబ్స్ సపోర్ట్ వంటి మరికొన్ని మార్పులు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఇవి ఎక్స్‌పెరిమెంటల్ ఫ్లాగ్ రూపంలో ఉన్నాయని, త్వరలోనే యూజర్ల అందరికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్ వెల్లడించింది. అలాగే జెమిని ఆధారిత ఫీచర్లను క్రోమ్‌బుక్ వినియోగదారులకు కూడా విస్తరించింది. మొత్తంగా చూస్తే బ్రౌజర్ వార్స్ మరోసారి హీట్ ఎక్కుతున్నాయని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.