Pixel smartphones: భారత్‌లో తయారైన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లను యూరప్‌లో విక్రయించనున్న గూగుల్
టెక్ దిగ్గజం గూగుల్ త్వరలో భారతదేశంలో తన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీని ప్రారంభించనుంది. భారతదేశంలో తయారైన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లను యూరప్, అమెరికా మార్కెట్‌లకు ఎగుమతి చేయాలని కూడా గూగుల్ యోచిస్తోంది. పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లను భారతదేశంలో తయారు చేయడానికి ఫాక్స్‌కాన్‌తో కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. Google త్వరలో Foxconn, Dixon అనుబంధ సంస్థ Padgett Electronics ద్వారా హ్యాండ్‌సెట్‌లను ఉత్పత్తి చేయడం ప్రారంభించనుంది. భారతదేశంలో పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ చాలా తక్కువగా ఉంది. అందుకే ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీని సద్వినియోగం చేసుకొని స్థానికంగా తయారయ్యే చాలా పరికరాలను యూరోపియన్, అమెరికా మార్కెట్లలో విక్రయించాలని గూగుల్ యోచిస్తోంది.
తమిళనాడులో పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లు తయారీ
Foxconn, Google మధ్య ఒప్పందం ప్రకారం, భవిష్యత్తులో Google Pixel స్మార్ట్‌ఫోన్‌లు భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో తయారు చేయబడతాయి. మనీకంట్రోల్ ప్రకారం, గూగుల్ పిక్సెల్ బేస్ వేరియంట్‌ను స్వదేశీ డిక్సన్ టెక్నాలజీస్ తయారు చేస్తుంది, అయితే ప్రో వేరియంట్‌కు ఫాక్స్‌కాన్ బాధ్యత వహిస్తుంది. టెక్ దిగ్గజం గత సంవత్సరం పిక్సెల్ 8ని లాంచ్ చేసినప్పుడు భారతదేశంలో పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేసే ప్రణాళికలను ప్రకటించింది. ఈ తయారీ యూనిట్‌లో కంపెనీ తన డ్రోన్‌లను కూడా తయారు చేయగలదని కొన్ని మీడియా నివేదికలలో పేర్కొంది.