Google : వినియోగదారులకు క్షమాపణలు చెప్పిన గూగుల్.. కారణమిదే
క్రౌమ్ వెబ్ బ్రౌజర్‌లో బగ్ కారణంగా 15 మిలిమన్ల మంది విండోస్ వినియోగదారులకు గూగుల్ క్షమాపణలు చెప్పింది. విండోస్ వినియోగదారులు సేవ్ చేసుకున్న పాస్ వర్డ్ లకు యాక్సెస్ కోల్పోవడంతో క్షమాపణలు కోరింది. జూలై 24న ప్రారంభమై దాదాపు 18 గంటల పాటు కొనసాగిన ఈ సమస్యకు "సరైన ఫీచర్ గార్డ్ లేకుండా ఉత్పత్తి ప్రవర్తనలో మార్పు" కారణమని గూగుల్ స్పష్టం చేసింది.
అసౌకర్యానికి గురైన 2శాతం మంది యూజర్లు
కాన్ఫిగరేషన్ మార్పును చూసిన దాని యూజర్ బేస్‌లో దాదాపు 2శాతం మంది ఈ సమస్య వల్ల ప్రభావితమయ్యారని Google అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్లకు పైగా క్రోమ్ వినియోగదారులు, విండోస్ యూజర్‌లను సొంతం చేసుకుంది. ఈ లోపం కారణంగా పాస్‌వర్డ్‌లను కోల్పోయిన దాదాపు 15 మిలియన్ల మంది వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. ఈ సేవకు అంతరాయం వల్ల కలగడంతో క్షమాపణలు చెప్పింది.