Page Loader
భారతదేశంలో పోయిన లేదా దొంగిలించిన ఫోన్‌లను కనుగొనడానికి సహాయం చేస్తున్న  ప్రభుత్వం
రాష్ట్రాలకు, UTలకు మార్చి 15న ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది

భారతదేశంలో పోయిన లేదా దొంగిలించిన ఫోన్‌లను కనుగొనడానికి సహాయం చేస్తున్న ప్రభుత్వం

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 20, 2023
07:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (CEIR), నకిలీ మొబైల్ ఫోన్ మార్కెట్‌ను అరికట్టడానికి కేంద్ర టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థ విభాగం (DoT) ద్వారా నిర్వహిస్తుంది. CEIR డేటాబేస్ ప్రకారం, రాష్ట్రాలు, UTలకు మార్చి 15న ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. CEIR మొదట దాద్రా, నగర్ హవేలీ, గోవా, మహారాష్ట్రలలో సెప్టెంబర్ 2019లో ప్రారంభమైంది. తర్వాత డిసెంబర్ 2019లో ఢిల్లీలో సేవను విస్తరించింది ప్రభుత్వం. CEIRని ఉపయోగించడానికి, వినియోగదారులు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లవచ్చు లేదా ఆండ్రాయిడ్, iOS కోసం CEIR యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వినియోగదారులు తమ ఫోన్ IMEI నంబర్‌ను సమర్పించాల్సిన అవసరం ఉంది. స్మార్ట్‌ఫోన్ బాక్స్‌లో నంబర్‌ ఉంటుంది. IMEI నంబర్‌ని తెలుసుకోవడానికి ఫోన్‌లో *#06# డయల్ చేయచ్చు.

ప్రభుత్వం

బ్లాకింగ్ రిక్వెస్ట్ పంపించాక, ఫోన్ 24 గంటల్లో బ్లాక్ అవుతుంది

CEIR తప్పనిసరిగా IMEI నంబర్ ద్వారా ఫోన్‌ను బ్లాక్ చేస్తుంది లేదా బ్లాక్‌లిస్ట్ చేస్తుంది, దొంగలించినవారు SIM కార్డ్‌ని మార్చినప్పటికీ అది పని చేయదు. CEIR పని చేయడానికి, వినియోగదారులు రిక్వెస్ట్ సమర్పించాలి, సమీప స్టేషన్‌లో FIR కూడా ఫైల్ చేయాలి. ఆపై, వెబ్‌సైట్, యాప్‌లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ ఫారమ్‌ను పూరించాలి. బ్లాకింగ్ రిక్వెస్ట్ పంపించిన తర్వాత, ఫోన్ 24 గంటల్లో బ్లాక్ అవుతుంది. తర్వాత, భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌లోనూ పనిచేయదు. ఫోన్ దొరికిన తర్వాత, మీరు డివైజ్ ను అన్‌బ్లాక్ చేయాల్సి ఉంటుంది. CEIR దగ్గర అన్‌బ్లాక్ ఆప్షన్ ఉంది. అందుకోసం అభ్యర్థన ID, ఇతర వివరాలను సమర్పించాలి.