
పక్షుల మెదడులో జీపీఎస్ కనుగొన్న శాస్త్రవేత్తలు
ఈ వార్తాకథనం ఏంటి
పక్షుల మెదడులో జీపీఎస్ ఏంటనే ఆశ్చర్యం కలగడం సహజమే. కానీ తాజా పరిశోధనలు తెలియజేస్తున్న వివరాల ప్రకారం పక్షుల మెదడులో సహజ జీపీఎస్ ఉంటుందట.
సూర్యుడి నుండి ప్లాస్మా, కాస్మిక్ కిరణాల నుండి భూమి మీద ఆవాసముంటున్న జీవరాశులను కాపాడేది భూమికి ఉన్న అయస్కాంత క్షేత్రమే.
ఆ అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుని పక్షులు తాము వెళ్లాలనుకున్న చోటుకు అవలీలగా వెళ్ళగలుగుతున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే, పక్షులు తమ మెదడులో ఉన్న ప్రత్యేక జీపీఎస్ లక్షణాన్ని అవసరమైనపుడు ఆన్ చేసుకుంటాయి, ఆఫ్ చేసుకుంటాయని పరిశోధనలో వెల్లడైంది.
Details
రాత్రిపూట జీపీఎస్ ఆన్, పగటి పూట ఆఫ్
మెదడులో సహజంగా జీపీఎస్ ఉండే లక్షణం వలస వెళ్ళే పక్షుల్లో కనిపిస్తుందట.
అమెరికాకు చెందిన బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ, కెనడాకు చెందిన వెస్ట్రన్ ఒంటారియో యూనివర్సిటీలు కలిసి జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు బహిర్గతం అయ్యాయి.
అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుని మెదడులో క్లస్టర్ ఎన్ అనే భాగాన్ని యాక్టివేట్ చేసుకుని, వాటికి కావాల్సిన ప్రదేశాలకు వలస వెళ్తాయట. అలాగే విశ్రాంతి తీసుకోవాలనుకుంటే క్లస్టర్ ఎన్ ని ఆఫ్ చేసుకుంటాయట.
మెడ్లిన్ బ్రాడ్ బెక్ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధన, తెల్లగొంతు పిచ్చుకల్లో జరిగిందని అధ్యయనంలో ప్రచురించారు.