యూట్యూబ్ క్రియేటర్లకు అదిరిపోయే వార్త.. ఇక డబ్బులు సంపాదించడం ఈజీ!
ఈ రోజుల్లో చాలామంది సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి డబ్బులను సంపాదించుకుంటున్నారు. తాజాగా కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ శుభవార్తను అందించింది. యూట్యూబ్ తన మానిటైజేషన్ రూల్స్ మరింత సడలించింది. మానిటైజేషన్ పొందేందుకు కావాల్సిన సబ్ స్క్రైబర్ల సంఖ్యను సగానికి పైగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం తక్కువ సబ్ స్క్రైబర్ల బేస్ ఉన్న క్రియేటర్లు సైతం ఇక సులభంగా డబ్బులు సంపాదించే వీలు ఉంది. చాలామంది యూట్యూబర్లు మానిటైజేషన్ చేయడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మానిటైజేషన్ అర్హత సాధించాలంటే కనీసం 1000 మంది సబ్ స్త్క్రెబర్లు అవసరం. కొత్త రూల్స్ లో 500 సబ్ స్క్రైబర్లు ఉంటే మానిటైజేషన్ అవుతుంది.
త్వరలో భారత్ లో అమలు
మానిటైజేషన్ పొందడానికి గతంలో 4వేల గంటల పాటు యూట్యూబ్ ప్లాట్ ఫామ్ పై క్రియేట్ చేసిన కంటెంట్ ను వీక్షకులు చూసి ఉండాలి. ప్రస్తుతం ఆ వీక్షణ గంటల సంఖ్యను 3వేలకు తగ్గించారు. తాజాగాగా క్రియేటర్లు 3వేల వాచ్ అవర్స్ ను కానీ, 3 మిలియన్ షార్ట్స్ వ్యూస్ ను పొంది ఉంటే చాలు, గతంలో ఇది 10 మిలియన్లుగా ఉండేది. అయితే యూట్యూబ్ పార్ట్ నర్ ప్రోగ్రామ్ కు సంబంధించిన ఈ నిబంధనల సడలింపు ఇంకా భారత్ లో అమలు కాలేదు. అయితే అమెరికా, బ్రిటన్, కెనడా, తైవాన్, దక్షిణ కోరియా దేశాల్లో అమల్లోకి వచ్చిన తర్వాత ఇతర దేశాల్లో ఈ ప్లాన్ ను అమలు చేయనున్నారు.