ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో ట్విట్టర్ లో ఫోన్ కాల్స్!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ లో సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో ట్విట్టర్ లో ఫోన్ కాల్ చేసుకొనే సదుపాయాన్ని కల్పించనున్నట్లు కంపెనీ సీఈఓ ఎలాన్ మాస్క్ వెల్లడించారు. దీంతో ప్రపంచంలోని ఎవరితోనైనా నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ట్విట్టర్ హ్యాండిల్ ద్వారానే వేరే యూజర్లతో వాయిస్, వీడియో చాటింగ్ చేసే సదుపాయం అందుబాటులోకి రానుంది. ట్విట్టర్ 2.0 ఎవ్రీథింగ్ యాప్ ను తీసుకొస్తామని గతేడాది చెప్పిన మాస్క్.. ఆ దిశగా ట్విట్టర్ కు క్రమంగా కొత్తకొత్త ఫీచర్లను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. వాట్సాప్ తరహాలో ఎన్ క్రిప్టెడ్ మెసేజ్ సదుపాయం కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించాడు.
ఇన్‍యాక్టివ్ అకౌంట్లను తొలగించనున్న ట్విట్టర్
ఇప్పటికే మెటాకు చెందిన ఫేస్ బుక్ మెసెంజర్ వాయిస్, వీడియో కాల్స్ సదుపాయం ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు ట్విట్టర్ లోనూ అలాంటి ఫీచర్లే అందుబాటులోకి తీసుకు రానున్నారు. అదే విధంగా ఎన్‌క్రిప్టెడ్ డైరక్ట్ సదుపాయం ట్విట్టర్ రేపటినుంచి అందుబాటులో ఉంటుందని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. ఎన్ క్రిప్టెడ్ మెసేజ్ ల తరహాలో ఫోన్ కాల్స్ కూడా ఎన్ క్రిప్టెడ్ అవునా కాదా అనే విషయాన్ని మాత్రం మస్క్ వెల్లడించలేదు. అయితే చాలా కాలం నుంచి వినియోగించకుండా ఉన్న అకౌంట్లను తొలగించనున్నట్లు ట్విట్టర్ గత వారం ప్రకటించింది.