NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం సక్సెస్.. నింగిలోకి విజయంతంగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు
    తదుపరి వార్తా కథనం
    జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం సక్సెస్.. నింగిలోకి విజయంతంగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు
    నింగిలోకి దూసుకెళ్తున్న ఉపగ్రహం

    జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం సక్సెస్.. నింగిలోకి విజయంతంగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 29, 2023
    12:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అరుదైన ఘనతను సాధించింది. సతీశ్ ధవన్ స్పేస్ షార్ నుంచి మరో రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది.

    ఉదయం 10.42 గంటలకు జీఎస్ఎల్‌వీ-ఎఫ్ 12 వాహన నౌక ద్వారా ఎన్‌వీఎస్-01 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లారు. దీంతో ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో వెల్లడించింది.

    సోమవారం నిర్వహించిన ఇస్రో నిర్వహించిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో పూర్తి స్థాయిలో నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. 12 ఏళ్ల పాటు ఈ ఉపగ్రహం సేవలు అందించనుంది.

    ఇక త్వరలోనే నావిక్ పేరుతో దేశీయ నావిగేషన్ సేవలు ప్రారంభం కానున్నాయి.

    Details

    ప్రయోగ పనులను పర్యవేక్షించి ఇస్రో చైర్మన్

    ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్ డౌన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 7.12 గంటలకు ప్రారంభం కాగా.. ఇది నిరంతరాయంగా 27.30 గంటల కొనసాగిన తర్వాత షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

    అదే విధంగా భారతదేశానికి చెందిన రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో ఎన్ వీఎస్-01 మొదటిది కావడం విశేషం.

    ఈ ఉపగ్రహం వల్ల భూమి, జల, వాయు మార్గాల స్థితి గతులు, దిక్కులు తెలియజేయడం, వాహనచోదకులకు దిశా నిర్దేశం చేయడం, ఇంటర్నెట్ తో అనుసంధానం లాంటి ఎన్నో సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానుంది.

    ఈ ప్రయోగ పనులను ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్. సోమనాథ్ పర్యవేక్షించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇస్రో
    పరిశోధన

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    ఇస్రో

    అరుదైన తోకచుక్క చిత్రాలను తీసిన చంద్ర టెలిస్కోప్ భారతదేశం
    ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి ఉత్తరాఖండ్
    విపత్తులు, వాతావరణ మార్పులను ట్రాక్ చేసే నాసా-ఇస్రో NISAR మిషన్ నాసా
    భారతదేశ వ్యోమగామి శిక్షణా కార్యక్రమానికి సహకరించనున్న IIT మద్రాస్-ఇస్రో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    పరిశోధన

    జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా చిన్న మెయిన్-బెల్ట్ గ్రహశకలాన్ని గుర్తించిన నాసా నాసా
    SSLV రెండో ప్రయోగానికి ఫిబ్రవరి 10వ తేదీన ముహూర్తం పెట్టిన ఇస్రో ఇస్రో
    కొత్త రాకెట్ SSLV-D2 ను ప్రయోగించనున్నఇస్రో ఇస్రో
    సూర్యుని నుండి భారీ ముక్క విరగడంతో ఆశ్చర్యంలో శాస్త్రవేత్తలు సూర్యుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025