Loading...
PM Modi: జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌18 ప్రయోగం సక్సెస్.. ఇస్రో శాస్త్రవేత్తలపై మోదీ ప్రశంసలు!
జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌18 ప్రయోగం సక్సెస్.. ఇస్రో శాస్త్రవేత్తలపై మోదీ ప్రశంసలు!

PM Modi: జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌18 ప్రయోగం సక్సెస్.. ఇస్రో శాస్త్రవేత్తలపై మోదీ ప్రశంసలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 31, 2026
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌18 రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష రంగంలో భారత శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి దేశానికి గర్వకారణమని ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందించారు. ''మన అంతరిక్ష రంగ శాస్త్రవేత్తల అంకితభావం, ప్రతిభ దేశాన్ని నిరంతరం గర్వపడేలా చేస్తున్నాయి. స్వదేశీ ఉపగ్రహ నేవిగేషన్ వ్యవస్థ నావిక్‌ (NavIC)ను మరింత బలోపేతం చేసే దిశగా ఈ విజయం కీలక ముందడుగు. ఎన్‌వీఎస్‌-03 ఉపగ్రహం మెరుగైన సామర్థ్యాలను ఈ ప్రయోగం చాటిచెప్పింది.

వివరాలు

దేశవ్యాప్తంగా బలపడనున్న నేవిగేషన్‌ వ్యవస్థ

దేశవ్యాప్తంగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నేవిగేషన్ సేవలకు ఈ ఉపగ్రహం మరింత మద్దతు అందించనుందని పేర్కొన్నారు.

కాగా, శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం రాత్రి 11.51 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌18 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.

ప్రయోగం జరిగిన సుమారు 20 నిమిషాల తర్వాత ఎన్‌వీఎస్‌-03 నేవిగేషన్‌ ఉపగ్రహాన్ని నిర్దేశిత భూస్థిర కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.

భారత్‌కు సొంతంగా ఉన్న నేవిగేషన్‌ వ్యవస్థ నావిక్‌ సేవలను మరింత బలోపేతం చేయడమే ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యం.

ఎన్‌వీఎస్‌-03 ఉపగ్రహం అందించే సేవలతో దేశవ్యాప్తంగా నేవిగేషన్‌ వ్యవస్థ సామర్థ్యం మరింత మెరుగుపడనుంది.

ADVERTISEMENT