LOADING...
GST 2.0: ₹50,000 పైగా ఉన్న ఆపిల్, శాంసంగ్, షియోమీ మొబైల్స్ చౌకగా మారుతాయా?
₹50,000 పైగా ఉన్న ఆపిల్, శాంసంగ్, షియోమీ మొబైల్స్ చౌకగా మారుతాయా?

GST 2.0: ₹50,000 పైగా ఉన్న ఆపిల్, శాంసంగ్, షియోమీ మొబైల్స్ చౌకగా మారుతాయా?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 22, 2025
02:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

వస్తు, సేవల పన్ను (GST) వ్యవస్థలో భారీ మార్పు భారత ప్రభుత్వం 2025 సెప్టెంబర్ 22 నుంచి అమలు చేసింది. కొత్త నియమాల ప్రకారం, వస్తువుల వర్గాన్ని బట్టి కేవలం రెండు GST స్లాబ్స్‌ మాత్రమే ఉంటాయి. ఈ మార్పు ద్వారా పన్ను వ్యవస్థను సరళతరం చేయడం లక్ష్యం. ఈ పరిష్కారం ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ వినియోగదారులకు సౌకర్యం కలిగిస్తుంది. టెలివిజన్, ఎయిర్ కండీషనర్లు వంటి పరికరాలపై GST తగ్గించబడింది. జీవనశైలి మార్పులు, వాతావరణ పరిస్థితులు క్రమంగా గృహాల్లో ఈ పరికరాలను అవసరమైనవిగా మార్చినందున ఈ తగ్గింపు ఇచ్చారు. కానీ, స్మార్ట్‌ఫోన్‌లకు ఈ తగ్గింపు వర్తించదు. మొబైల్ ఫోన్లపై ఇప్పటి 18 శాతం GST కొనసాగుతుంది, అందువల్ల రీటైల్ ధరల్లో మార్పు రాదు.

వివరాలు 

 వినియోగదారులకు పండుగ సీజన్ డిస్కౌంట్లు

ల్యాప్టాప్‌లు కూడా కొత్త పన్ను విధానంలో మినహాయింపు పొందలేదు. దీని పై వివాదం మొదలైంది. రోజువారీ జీవితంలో ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్లను "అవసర వస్తువులు"గా ఎందుకు చూడలేదని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. GST తగ్గింపులు ఫోన్లు,ల్యాప్టాప్‌ల ధరను నేరుగా తగ్గించకపోయినా,పండుగ సీజన్ డిస్కౌంట్లు వినియోగదారులకు లభిస్తాయి. ప్రధాన ఆన్‌లైన్ సేల్స్,ఉదాహరణకు Amazon Great Indian Festival, Flipkart Big Billion Days 2025 సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం అవుతున్నాయి. Amazon India Great Indian Festival 2025 లో శాంసంగ్, ఆపిల్, వన్ ప్లస్, iQOO, Xiaomi, realme, Lava వంటి బ్రాండ్‌ల ఫోన్లు, యాక్ససరీస్ లపై తగ్గింపు ధరలు లభిస్తాయి.

వివరాలు 

కార్ల ధరల్లో తగ్గింపులు

ప్రైమ్ సభ్యులకు సేల్ ప్రారంభం అయ్యే 24 గంటల ముందు ప్రత్యేక ప్రవేశం లభిస్తుంది. Flipkart కూడా వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలు, యాక్ససరీస్ లపై తగ్గింపు ధరలు అందిస్తోంది. ముఖ్యమైన డీల్‌లలో Apple AirPods Pro (2nd Gen),Samsung Galaxy Book 4 ల్యాప్టాప్‌లు,iPads, boAt సౌండ్‌బార్స్, Fujifilm Instax Mini ఫిల్మ్ రోల్స్, Philips వ్యక్తిగత శ్రేణి ఉత్పత్తులు ఉన్నాయి. మరోవైపు, ఆటో మొబైల్ రంగంలో భారీ ప్రభావం కనిపిస్తోంది. GST సవరణల తర్వాత, పలువురు ప్రముఖ కార్ల తయారీదారులు తమ కార్ల ధరల్లో తగ్గింపులు ప్రకటించారు. చిన్న కార్లపై GST 28 శాతం నుండి 18 శాతానికి తగ్గింది. దాంతో భారత వినియోగదారులు పెద్ద మొత్తంలో డబ్బు సేవ్ చేసుకోగలుగుతారు.