GTA 6 AI Photo: మీ సెల్ఫీని జిటిఏ 6 పోస్టర్‌గా ఇలా మార్చేయండి
ఈ వార్తాకథనం ఏంటి
జిటిఏ 6 హవా సోషల్ మీడియాలో కొనసాగుతుండగానే.. ఇప్పుడు ఆ గేమ్ తరహా పోస్టర్లుగా తమ ఫొటోలను మార్చుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. సాధారణ సెల్ఫీని AI టూల్స్ సాయంతో నియాన్ లైట్లు, పామ్ చెట్లు, స్పోర్ట్స్ కార్లు, సన్‌సెట్ బ్యాక్‌గ్రౌండ్‌తో కూడిన Vice City స్టైల్ పోస్టర్‌గా మార్చేస్తున్నారు. ప్రత్యేకంగా Google Gemini, ChatGPTలో సరైన ప్రాంప్ట్ ఇస్తే ఈ పని చాలా సులభంగా పూర్తవుతుంది. పెద్దగా ఫొటో ఎడిటింగ్ పరిజ్ఞానం లేకపోయినా.. మంచి క్వాలిటీ ఉన్న ఒక ఫొటో, సరైన ప్రాంప్ట్ ఉంటే చాలు.
Details
ముందుగా ఫొటోను ఇలా ఎంచుకోండి
ఈ ట్రెండ్‌లో మంచి ఫలితం రావాలంటే ముందుగా సెల్ఫీ క్వాలిటీపై దృష్టి పెట్టాలి. ముఖం స్పష్టంగా కనిపించే, మంచి వెలుతురు ఉన్న ఫొటోను ఎంచుకోవడం మంచిది.
ఎక్కువ నీడలు ఉన్న చిత్రాలు లేదా చాలా దూరంగా తీసిన ఫొటోల్లో ముఖాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సరిగ్గా గుర్తించడం కష్టమవుతుంది.
ఫొటోను Gemini లేదా ChatGPTలో అప్‌లోడ్ చేసి.. మీ ముఖ ఆకృతి, హెయిర్‌స్టైల్, ఎక్స్‌ప్రెషన్ మార్చకుండా ఉంచాలని ప్రాంప్ట్‌లో స్పష్టంగా చెప్పాలి. ఇలా చేస్తే ఫలితం అసలు సెల్ఫీకి దగ్గరగా ఉంటుంది.
Details
Geminiలో GTA 6 స్టైల్ ఎలా తెచ్చుకోవాలి?
Google Geminiలో కొత్త చాట్ ఓపెన్ చేసి, ఇమేజ్ క్రియేషన్ ఆప్షన్ ద్వారా మీ ఫొటోను అప్‌లోడ్ చేయండి.
ఆ తర్వాత GTA తరహా ఓపెన్ వరల్డ్ వీడియో గేమ్ పోస్టర్ లుక్ కావాలని ప్రాంప్ట్ ఇవ్వొచ్చు. ఉదాహరణకు.. "నా ఫొటోను సినిమాటిక్ వర్టికల్ వీడియో గేమ్ పోస్టర్‌గా మార్చు.
ముఖ లక్షణాలు, హెయిర్‌స్టైల్, ఎక్స్‌ప్రెషన్ అలాగే ఉంచు. వైబ్రెంట్ కలర్స్, షార్ప్ అవుట్‌లైన్స్, నియాన్ లైట్లు, పామ్ చెట్లు, లగ్జరీ కార్లు, సన్‌సెట్ స్కైతో Vice City తరహా నేపథ్యాన్ని రూపొందించు" అని అడగవచ్చు.
Details
ChatGPTలోనూ ఇదే ట్రెండ్ ట్రై చేయొచ్చు
ఇదే విధానాన్ని ChatGPTలో కూడా ప్రయత్నించవచ్చు. ఫొటోను అప్‌లోడ్ చేసి, సినిమాటిక్ వర్టికల్ పోర్ట్రెయిట్‌గా మార్చాలని, ముఖాన్ని మార్చకుండా ఉంచాలని సూచిస్తూ వివరమైన ప్రాంప్ట్ ఇవ్వాలి.
ఫలితం నచ్చకపోతే వెంటనే మరో సూచన ఇవ్వొచ్చు. ఉదాహరణకు.. ముఖం ఒరిజినల్ ఫొటోకు మరింత దగ్గరగా ఉండాలని, సన్‌సెట్ రంగులు మరింత ప్రకాశవంతంగా ఉండాలని అడగవచ్చు.
అయితే ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసే ముందు చేతులు, వేళ్లు, కళ్లద్దాలు, కార్లు వంటి బ్యాక్‌గ్రౌండ్ వివరాల్లో AI చేసిన తప్పులను ఒకసారి పరిశీలించాలి. ఇతరుల ఫొటోలను వారి అనుమతి లేకుండా మార్చడం కూడా మంచిది కాదు.