LOADING...
Perzea: బ్రెస్ట్ క్యాన్సర్‌ చికిత్సకు సరికొత్త ఔషధాన్ని తీసుకొచ్చిన హెటిరో హెల్త్‌‌‌‌కేర్ లిమిటెడ్ 
అందుబాటులోకి తెచ్చిన హెటిరో హెల్త్‌‌‌‌కేర్ లిమిటెడ్

Perzea: బ్రెస్ట్ క్యాన్సర్‌ చికిత్సకు సరికొత్త ఔషధాన్ని తీసుకొచ్చిన హెటిరో హెల్త్‌‌‌‌కేర్ లిమిటెడ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 22, 2025
03:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలోని ప్రముఖ ఔషధ కంపెనీలలో ఒకటైన హెటిరో హెల్త్‌‌‌‌కేర్ లిమిటెడ్(Hetero Healthcare Ltd) బ్రెస్ట్ క్యాన్సర్‌ రోగుల కోసం సరికొత్త ఔషధాన్ని విడుదల చేసింది. హెచ్‌‌‌‌ఈఆర్‌‌‌‌2-పాజిటివ్ (Her2-positive)రకం బ్రెస్ట్ క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగించే ప్రసిద్ధ ఔషధం పెర్టుజుమాబ్‌ (Pertuzumab)కు బయోసిమిలర్ గా పెర్జియా (Perzea)ను భారత మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఈ ఔషధాన్ని ఎన్‌జీన్ బయోసైన్సెస్‌‌‌‌ లిమిటెడ్‌(Enzene Biosciences Ltd)తో భాగస్వామ్యంలో లాంచ్ చేశారు. పెర్జియా 420 ఎంజీ ఇంజెక్షన్ ధరను రూ.30,000 గా నిర్ణయించారు.పెర్టుజుమాబ్‌ను క్యాన్సర్ చికిత్సలో సాధారణంగా ట్రాస్టుజుమాబ్‌ (Trastuzumab)తో కలిపి ఉపయోగిస్తారు. ఈ కాంబినేషన్ బ్రెస్ట్ క్యాన్సర్‌ కీమోథెరపీకి ముఖ్యమైనది. పెర్జియా మార్కెట్‌లోకి రావడం ద్వారా,వేలాది భారతీయ రోగులు అధునాతన,తక్కువ ఖర్చుతో క్యాన్సర్ చికిత్సలను పొందే అవకాశం ఏర్పడింది.

వివరాలు 

ఆంకాలజీ, యాంటీ వైరల్స్‌, క్రిటికల్ కేర్‌‌ విభాగాల్లో  ఫోకస్ పెట్టిన హెటిరో

దీని ద్వారా క్యాన్సర్ రోగుల ఖర్చును తగ్గించడంలో హెటిరో సంస్థ ముఖ్య పాత్ర పోషిస్తోంది. హెటిరో సంస్థ ఎండీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, సరసమైన ధరలతో ఇన్నోవేటివ్ ఉత్పత్తులను ప్రజలకు అందించడంపై సంస్థ దృష్టి సారించిందని చెప్పారు. ఎన్‌జీన్ బయోసైన్సెస్‌తో కలసి పెర్జియాను లాంచ్ చేయడం, ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్సలను భారత రోగులకూ అందించాలన్న హెటిరో నిబద్ధతను ప్రతిబింబించిందని ఆయన గుర్తుచేశారు. ఎన్‌జీన్ బయోసైన్సెస్ సీఈఓ హిమాంశు గాడ్గిల్ మాట్లాడుతూ, హెటిరోతో భాగస్వామ్యం ఏర్పాటు చేసి పెర్జియాను తీసుకురావడం భారత క్యాన్సర్ చికిత్సలో ఒక కీలక మార్పుకు సంకేతంగా ఉన్నదని చెప్పారు. అలాగే, ఆంకాలజీ, యాంటీ వైరల్స్‌, క్రిటికల్ కేర్‌‌ విభాగాల్లో హెటిరో హెల్త్‌‌‌‌కేర్ ఎక్కువ ఫోకస్ పెట్టిందని ఆయన తెలిపారు.