ఇస్రో: చంద్రుడిపై చంద్రయాన్ 3 ల్యాండే అయ్యేటపుడు ఎన్ని దశలుంటాయో తెలుసా?
చంద్రయాన్-3 మిషన్ లాంచ్ కావడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. రేపు మధ్యాహ్నం 2:35నిమిషాలకు LVM3 రాకెట్ సాయంతో శ్రీహరికోట నుండి చంద్రయాన్-3 లాంచ్ కానుంది. ఈ మిషన్, చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ కానుంది. కొంచెం అటూ ఇటూగా ఆగస్టు 24వ తేదీ రోజున చంద్రయాన్-3 మిషన్, చంద్రుడిని చేరనుంది. చంద్రయాన్-3 మిషన్ లో ప్రొపుల్సన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, 26కిలోల రోవర్ ఉంటుంది. చంద్రుడి మీద సురక్షితంగా దిగడానికి ల్యాండర్ కు బలమైన కాళ్ళు, ల్యాండ్ అయ్యేటప్పుడు మధ్యలో ఏదైనా అడ్డు తగిలితే చూపించే కెమెరాలను సెట్ చేసారు. ఈ మిషన్ లో ఆర్బిటార్ లేదు. కమ్యూనికేషన్ రిలే సాటిలైట్ గా ప్రొపుల్సన్ మాడ్యూల్ పనిచేస్తుంది.
చంద్రుడి పరిస్థితులను అధ్యయనం చేసే రోవర్
చంద్రయాన్-3 మిషన్ లో మూడు దశలు ఉన్నాయి. భూమి దశ, చంద్రుడి పైకి వెళ్ళే దశ, చంద్ర దశ. లాంచ్ కి ముందు జరిగే కార్యక్రమాలన్నీ భూమి దశలో భాగం, లాంచ్ అయ్యి చంద్రుడి పైకి వెళ్ళడం రెండవ దశ. చంద్రుడి పైకి వెళ్ళాక ముడవ దశ మొదలవుతుంది. ఈ మూడవ దశలో 8 స్టెప్స్ ఉంటాయి. చంద్రుడి కక్ష్యలోకి వెళ్ళడం, మూన్ బౌండ్ దశ, లూనార్ మాడ్యూల్ విడిపోవడం, డీ-బూస్ట్ దశ, ప్రీ ల్యాండింగ్, ల్యాండింగ్, ల్యాండర్, రోవర్ల కోసం సాధారణ దశ, ప్రొపుల్సన్ మాడ్యూల్ దశ. చంద్రుడి మీద రోవర్ ల్యాండ్ అవగానే అక్కడి పరిస్థితులను అది అధ్యయనం చేస్తుంది.