iPhone 15 vs iPhone 14: ఈ రెండు ఫోన్ల మధ్య తేడాలను తెలుసుకుందాం
ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ యాపిల్ తన కొత్త మొబైల్ 'ఐఫోన్ 15'ను సెప్టెంబర్‌లో ఆవిష్కరించనుంది. ఈ సిరీస్‌లో Standard iPhone 15, 15Plus, 15Pro Max వేరియంట్లు ఉన్నాయి. ప్రో మోడల్ ఐఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉంటాయని కంపెనీ చెబుతోంది. అలాగే మిగతా రెండు వేరియంట్లు కూడా కస్టమర్లు కోరుకునే విధంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నాయి. గతేడాది 'ఐఫోన్ 14'ను యాపిల్ విడుదల చేసింది. అయితే ఆ సిరీస్‌లో iPhone 14 Pro/Pro Max మోడల్‌లతో పోలిస్తే iPhone 14/14Plus మోడల్స్ బాగా ఆకర్షించాయి. అప్పుడు ఫోన్ డిజైన్ వినియోగదారులకు అంతగా నచ్చేలేదని రివ్యూలు వచ్చాయి. 'ఐఫోన్ 15' మోడల్స్ విషయంలో యాపిల్ సంస్థ డిజైన్ లోటును భర్తీ చేసిందని టాక్.
మూడు కలర్స్‌లో ఐఫోన్ -15 లభ్యం
ఐఫోన్ 15 ప్రస్తుతం ఉన్న మోడల్‌తో పోలిస్తే కొంచెం సన్నగా ఉండే బెజెల్‌లను కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి మరింత గుండ్రని అంచులు, పెద్ద కెమెరా బంప్ ఉండవచ్చు. 6.2-అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్ ఐఫోన్ 15 మోడల్ ఫోన్ కలిగి ఉంటుంది. ఆకుపచ్చ, లేత పసుపు, గులాబీ రంగుల్లో కొత్త ఫోన్లను యాపిల్ సంస్థ తీసుకొస్తోంది. ఐఫోన్-14 మోడల్ కెమెరా 12MP ఉంటే, ఐఫోన్-15 మోడల్‌ను 48MPతో తీసుకొస్తున్నారు. సెల్ఫీల కోసం 12MP కెమెరాను అందిస్తున్నారు. ఐఫోన్ 14 ప్రో/ప్రో మాక్స్ బ్యాటరీ సామర్థ్యం 3,279mAh ఉంటే, ఐఫోన్ 15 బ్యాటరీ సామర్థ్యం 3,877mAh కావడం గమనార్హం. ఐఫోన్ 15 సిరీస్ దాదాపు రూ. 65,650 ధరకు విక్రయించనున్నారు.