
Arattai App:అరట్టై యాప్‌లో వాట్సాప్ చాట్ ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలి?
ఈ వార్తాకథనం ఏంటి
స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన అరట్టై యాప్ ఇప్పుడు ఎక్కువ మంది వినియోగిస్తున్న యాప్‌లలో ఒకటిగా మారింది. పలువురు మంత్రులు, సీఈఓలు కూడా దీన్ని ప్రోత్సహిస్తూ, "అరట్టై యాప్ వినియోగించండి" అని పిలుపునివ్వడంతో, దీనిని డౌన్‌లోడ్ చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే వాట్సాప్ ఉపయోగిస్తున్నవారు తమ చాట్లను సులభంగా అరట్టై యాప్‌కి మార్చుకోవచ్చునని తెలుసుకోవడం ఈ యాప్ వినియోగాన్ని మరింత పెంచింది. ఇది వారి రోజువారీ కమ్యూనికేషన్‌ను అంతరాయం లేకుండా కొనసాగించడానికి సహాయపడుతుంది.
వివరాలు
చాట్ ట్రాన్స్‌ఫర్ విధానం
ముందుగా అరట్టై యాప్‌ను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలి. యాప్ ప్రారంభించిన తర్వాత, అది కాంటాక్ట్స్ యాక్సెస్ చేసే అనుమతిని (permission) ఇవ్వాలి. ఆపై వాట్సాప్‌లోకి వెళ్లి, ప్రొఫైల్ ఆప్షన్‌లో "Export Chat" ఆప్షన్‌ని ఎంచుకోవాలి. మీరు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకునే చాట్ కాంటాక్ట్‌లను సెలెక్ట్ చేసి, Attach Media ఎంపికపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆప్షన్స్‌లో అరట్టైని ఎంచుకోవాలి. ఈ విధంగా ఆ చాట్ సులభంగా అరట్టై యాప్‌లోకి బదిలీ అవుతుంది. గమనిక: ఫొటోలు, వీడియోలు ట్రాన్స్‌ఫర్ కావాలననుకుంటే Attach Media ఆప్షన్‌ని సెలెక్ట్ చేయాలి. కానీ అవి కావాలనుకోకపోతే ఆ ఆప్షన్‌ని ఎంచుకోకుండానే కంటిన్యూ చేయవచ్చు.
వివరాలు
ముఖ్యమైన షరతులు
అయితే ఈ చాట్ ట్రాన్స్ ఫర్ పూర్తి కావాలంటే మీరు ఎంచుకున్న కాంటాక్ట్ కూడా అరట్టైలో ఉండాలి. చాట్ ట్రాన్స్‌ఫర్‌కు ముందుగా వాట్సాప్‌లో బ్యాకప్ సెటప్ చేసుకోవడం అవసరం. దీనికి,వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి "Chat Backup"ఆప్షన్ ఎంచుకుని,జీమెయిల్‌లో చాట్లను బ్యాకప్ చేసుకోవచ్చు. అరట్టై యాప్ ప్రత్యేకతలు ఈయాప్ ఇప్పుడు Google Play Storeలో అందుబాటులో ఉంది. డౌన్‌లోడ్లు వేగంగా పెరుగుతున్నాయి. వాట్సాప్‌లో లేని కొన్ని ప్రత్యేక ఫీచర్లు అందిస్తుంది. తక్కువ మెమరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలో కూడా సులభంగా పని చేస్తుంది. ఈ యాప్ పూర్తిగా ఉచితం. యాప్ లోని యూజర్ డాటా అడ్వర్టైజింగ్ కోసం వినియోగించబోమని జోహో సంస్థ చెప్పింది. భవిష్యత్తులో,మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లు ఈ యాప్‌లో చేర్చనున్నట్లు జోహో ప్రకటించింది.