ఆపిల్ Music క్లాసికల్ ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం
ఆపిల్ Music క్లాసికల్ అనే ఆపిల్ శాస్త్రీయ సంగీత స్ట్రీమింగ్ యాప్ ఇప్పుడు ఐఫోన్ లలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఇందులో పాశ్చాత్య శాస్త్రీయ సంగీతానికి సంబంధించి ఐదు మిలియన్ల కంటే ఎక్కువ ట్రాక్‌లు ఉన్నాయి. ఫిల్టర్‌లను ఉపయోగించి వినియోగదారులు తమకు ఇష్టమైన ఆడియో ఫైల్‌లను చూడచ్చు. యాప్ ఉచితంగా అందుబాటులో ఉంది కానీ యాక్టివ్ ఆపిల్ Music సబ్‌స్క్రిప్షన్ అవసరం. ఈ నెల ప్రారంభంలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులోకి వచ్చిన తర్వాత యాప్ ఇప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి వచ్చింది. ఆగస్ట్ 2021లో, ఆపిల్ ఆమ్‌స్టర్‌డామ్ కు చెందిన క్లాసికల్ మ్యూజిక్ సర్వీస్, ప్రైమ్‌ఫోనిక్‌ని కొనుగోలు చేసింది. కొత్త ఆపిల్ Music Classical యాప్ దీని ఫలితంగా వచ్చింది.
ఇందులో కొన్ని హిందుస్థానీ క్లాసికల్, కర్నాటిక్ టైటిల్స్ ఉన్నాయి
ఇందులో క్యూరేటెడ్ ప్లేలిస్ట్స్, కంపోజర్ బయోస్, ప్రత్యేకమైన ఆల్బమ్‌లు, కొన్ని కీలక పనులపై ఎడిటోరియల్ డీప్ డైవ్‌ల రూపంలో ఐదు మిలియన్ల కంటే ఎక్కువ హై-క్వాలిటీ క్లాసికల్ మ్యూజిక్ ట్రాక్‌లను యాక్సెస్ చేయచ్చు. ఇందులో కొన్ని హిందుస్థానీ క్లాసికల్, కర్నాటిక్ టైటిల్స్ ఉన్నాయి. అనేక ఫిల్టర్‌లను ఉపయోగించి అనేక రకాల ట్రాక్‌లను బ్రౌజ్ చెయ్యచ్చు. వీటిని లైబ్రరీకి లేదా ప్లేలిస్ట్ కు యాడ్ చేసుకోవచ్చు, అయితే ట్రాక్‌లు డౌన్‌లోడ్ చేయలేరు. బ్లూటూత్ ద్వారా పాటల వినడానికి యాప్ హై-రెస్ ఆడియోకు సపోర్ట్ ఇస్తుంది ప్రస్తుతం ఇది iOS 15.4 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్‌లు నడుస్తున్న iOS డివైజెస్ కు మాత్రమే పనిచేస్తుంది.