
ఏ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ తీసుకుంటే బాగుంటుంది?
ఈ వార్తాకథనం ఏంటి
ఈ రోజుల్లో యాక్సెస్ చేయగల ఆన్-డిమాండ్ కంటెంట్ లైబ్రరీతో Spotify, అమెజాన్ Music, ఆపిల్ Music, యూట్యూబ్ Music వంటి ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ప్లాట్‌ఫారమ్‌ల ఫీచర్‌లు, సబ్‌స్క్రిప్షన్ ధరలను తెలుసుకుందాం.
ఆపిల్ మ్యూజిక్: ఇది 2015లో ప్రారంభమైంది. సబ్‌స్క్రైబర్‌లు ఒక నెల ఉచిత ట్రయల్‌ని పొందిన తర్వాత ప్రతి నెల రూ.99 చెల్లించాలి.
Spotify: iOS,ఆండ్రాయిడ్ రెండింటిలోనూ ఎక్కువగా ఉపయోగించే మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్. ఇది ఉచిత యాడ్-సపోర్టెడ్ యాక్సెస్‌తో పాటు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.
మినీ రోజుకు రూ.7, పర్సనల్ నెలకు రూ.119, డ్యూయల్ నెలకు రూ.149, కుటుంబ (6 మంది సభ్యుల వరకు) కనెక్షన్ నెలకు రూ.179 ఇలా వివిధ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి.
అమెజాన్
అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తో అమెజాన్ Music ఉచితంగా యాక్సెస్ చెయ్యచ్చు
అమెజాన్ Music: మిలియన్ల కొద్దీ యాడ్-ఫ్రీ (HD/Ultra-HD బిట్‌రేట్) ట్రాక్‌లు, ప్రత్యేకమైన కంటెంట్ అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్ అయితే, ఉచితంగా సేవను యాక్సెస్ చేయచ్చు. ఇది iOS, ఆండ్రాయిడ్, డెస్క్‌టాప్‌లకు యాక్సెస్ ఉంది. ప్రైమ్ సంవత్సరానికి ధర రూ. 1,499. ప్రత్యేకంగా, నాన్-ప్రైమ్ సభ్యులకు అమెజాన్ Music Unlimited (50 మిలియన్ ట్రాక్‌లతో) నెలకు రూ.129కు అందిస్తుంది .
యూట్యూబ్ Music: 2015 చివరిలో ఇది ప్రారంభమైంది. యాప్‌లో ఇప్పుడు 80 మిలియన్లకు పైగా పాటలు, మ్యూజిక్ వీడియోలు ఉన్నాయి. ఇది యాడ్-సపోర్టెడ్, పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మోడ్‌లలో అందుబాటులో ఉంటుంది. నెలవారీ, త్రైమాసిక, వార్షిక సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ల ధరలు రూ.109, రూ.309, రూ.990.