LOADING...
Nano Banana AI: నానో బనానా AI ట్రెండ్..ఈ సింపుల్ స్టెప్స్‌తో మీరూ కూడా మీ 3D ఇమేజ్ క్రియేట్ చేసేయండి..!
ఈ సింపుల్ స్టెప్స్‌తో మీరూ కూడా మీ 3D ఇమేజ్ క్రియేట్ చేసేయండి..!

Nano Banana AI: నానో బనానా AI ట్రెండ్..ఈ సింపుల్ స్టెప్స్‌తో మీరూ కూడా మీ 3D ఇమేజ్ క్రియేట్ చేసేయండి..!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 12, 2025
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

AI టెక్నాలజీ ప్రతిరోజు కొత్త-కొత్త అప్‌డేట్లతో వేగంగా ముందుకు వస్తోంది. ఇలాంటి అద్భుత ఆవిష్కరణలలో ఒకటి "నానో బనానా". ఈ ఫొటో ఎడిటింగ్ టూల్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ప్రత్యేకంగా యువతను ఈ ట్రెండ్ ఎంతో ఆకర్షిస్తోంది. ఈ టూల్ ద్వారా సృష్టించిన ఫొటోలు చూడగానే, బట్టలు, ముఖాభినయం, బ్యాక్‌గ్రౌండ్ అన్ని నేచురల్' గా కనిపిస్తాయి. అంతేకాక, ఈ టూల్ అందరికీ ఫ్రీగా అందుబాటులో ఉండటం వల్ల, ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన విధంగా ఫొటోలను సృష్టించుకోవడానికి దీన్ని వినియోగిస్తున్నారు.

వివరాలు 

అసలేంటి ఈ నానో బనానా క్రేజ్..? 

నానో బనానా అనేది గూగుల్ రూపొందించిన జెమినీ యాప్‌లో భాగంగా అందే ఒక అప్డేటెడ్ టూల్. దీని "నానో బనానా" అనేది కేవలం కోడ్ పేరు మాత్రమే. ఇది జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ మోడల్ ఆధారంగా రూపొందించబడింది. ఈ టూల్ సహాయంతో, ఫొటోలను కొద్ది సెకన్లలోనే మనకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. నెటిజన్లు దీనిని ముద్దుగా నానో బనానా అని పిలుస్తున్నారు.

వివరాలు 

ఎందుకింత పాపులర్..? 

ఈ టూల్ ఎందుకంత పాపులర్ అయిందంటే.. దీన్ని వాడటం చాలా ఈజీ. మీకు గూగుల్ అకౌంట్ ఉంటే చాలు.. ఇంకేలాంటి టెక్నాటజీ అవసరం లేదు. నానో బనానా ద్వారా ఫొటోలను అద్భుతమైన 3D చిత్రాలుగా మార్చవచ్చు, ఇవి చూడటానికి ఖరీదైన బొమ్మల వలే అనిపిస్తాయి. అదనంగా, వీటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం సులభంగా ఉండటంతో, లైకులు, షేర్లు భారీగా వస్తున్నాయి. సెలబ్రిటీలు కూడా ఈ ట్రెండ్‌లో చేరడంతో, దీని క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడిప్పుడు, హీరోలు, హీరోయిన్ల పెట్స్ ఫొటోలను 3D బొమ్మలుగా మార్చి సోషల్ మీడియాను నింపుతున్నారు.

వివరాలు 

మీరు కూడా మీ ఫొటోని ఈ సింపుల్ స్టెప్స్‌తో 3Dగా మార్చేసుకోండి.. 

1. ముందుగా గూగుల్ జెమినీ(https://gemini.google.com) వెబ్‌సైట్ కి వెళ్లి, మీ గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అవ్వండి. 2. "+" బటన్‌పై క్లిక్ చేసి, "అప్లోడ్ ఫైల్స్" ద్వారా మీ ఫొటోని అప్లోడ్ చేయండి. 3. తర్వాత ఈ క్రింది ప్రాంప్ట్‌ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి:

వివరాలు 

సింపుల్ స్టెప్స్‌

Create a 1/7 scale commercialized figurine of the characters in the picture, in a realistic style,in a real environment.The figurine is placed on a computer desk.The figurine has a round transparent acrylic base,with no text on the base.The content on the computer screen is a 3D modeling process of this figurine.Next to the computer screen is a toy packaging box,designed in a style reminiscent of high-quality collectible figures,printed with original artwork.The packaging features two-dimensional flat illustrations.

వివరాలు 

ఒకవేళ జెమినీ AI వర్క్ చేయకపోతే ఇలా కూడా ట్రే చేయవచ్చు.. 

కొన్ని సెకన్లలో ఆకర్షణీయమైన 3D ఫొటో తయారవుతుంది.దాన్నిడౌన్లోడ్ చేసి,సోషల్ మీడియాలో షేర్ చేయవచ్చు. 1st Step: ముందుగా Google AI Studio వెబ్‌సైట్‌కి వెళ్లి మీ గూగుల్ అకౌంట్‌కి లాగిన్ కావాలి. 2nd Step: అక్కడ మీకు "Nano Banana" లేదా "Gemini 2.5 Flash Image" అనే రెండు ఆప్షన్స్‌లో ఏది కనిపిస్తే ఆ టూల్‌ని ఎంచుకోండి. 3rd Step: ఇప్పుడు మీ ఫోటోను అప్‌లోడ్ చేయడానికి "+" బటన్‌పై క్లిక్ చేయండి.

వివరాలు 

ఒకవేళ జెమినీ AI వర్క్ చేయకపోతే ఇలా కూడా ట్రే చేయవచ్చు.. 

4th Step (Optional): ఇంకా అమేజింగ్ అవుట్‌పుట్ కోసం, మీరు టెక్స్ట్ ప్రాంప్ట్ కూడా ఇవ్వవచ్చు. అంటే మీకు మీ ఫొటో బొమ్మగా ఎలా ఉండాలో మాటల్లో వివరించడం. ఉదాహరణకు, "A beautiful girl in a white dress, standing on a wooden table with a smiling face" అని టైప్ చేయవచ్చు. 5th Step: ఇక అంతే.. AI మీ ఫోటోను ప్రాసెస్ చేసి 3D ఫొటోను సృష్టిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని.. వాట్సాప్‌, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసుకోండి.

వివరాలు 

గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు: 

ఇచ్చే ఫొటో క్వాలిటీగా, బ్రైట్‌గా ఉంటే, అవుట్‌పుట్ ఇంకా బాగా వస్తుంది. టెక్స్ట్ ప్రాంప్ట్‌లో దుస్తులు, లైటింగ్, బ్యాక్‌గ్రౌండ్ వంటి వివరాలు ఇచ్చితే, ఫొటో మరింత న్యాచురల్‌గా కనిపిస్తుంది. ఒకే ఫొటోను వేర్వేరు యాంగిల్స్‌లో, వేర్వేరు టెక్స్ట్ ప్రాంప్ట్‌లతో ప్రయత్నించండి.

వివరాలు 

ట్రెండ్ మాత్రమే కాదు, భవిష్యత్తు టెక్నాలజీ 

నానో బనానా కేవలం సరదా కోసం మాత్రమే కాదు, ఇది AI టెక్నాలజీ భవిష్యత్తును చూపిస్తోంది. ఒకప్పుడు 3D డిజైనింగ్ అనేది నిపుణుల పని. కానీ ఇప్పుడు ఎవరైనా తమ ఆలోచనలకు రూపం ఇవ్వగలరు. వినోదం, మార్కెటింగ్, విద్య వంటి రంగాల్లో ఇది కొత్త అవకాశాలను తెరుస్తోంది. ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో మొదలై, రేపటి సృజనాత్మక ప్రపంచానికి దారిచూపుతోంది. నెట్టింట్లో క్రేజ్ టూల్ విడుదల అయిన మొదటి వారంలోనే 10 మిలియన్ల మంది కొత్త వినియోగదారులు జెమినీ యాప్‌ను ఉపయోగించారు. దాదాపు 200 మిలియన్ల చిత్రాలను ఎడిట్ చేశారు. నానో బనానా టూల్ ఫొటో ఎడిటింగ్‌ను సరళంగా, సరదాగా మార్చి, సోషల్ మీడియా వినియోగదారులను ఆకర్షణీయంగా మార్చింది.