LOADING...
Huawei: టెక్ ప్రపంచంలో హువావే సెన్సేషన్.. తొలి వైడ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విడుదల
టెక్ ప్రపంచంలో హువావే సెన్సేషన్.. తొలి వైడ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విడుదల

Huawei: టెక్ ప్రపంచంలో హువావే సెన్సేషన్.. తొలి వైడ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 21, 2026
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

హువాయ్‌ ప్రపంచంలోనే తొలి 'వైడ్-ఫోల్డింగ్' స్మార్ట్‌ ఫోన్‌గా పేర్కొంటూ 'హువావే పురా ఎక్స్ మాక్స్'ను చైనాలో విడుదల చేసింది. ఈ డివైస్ ఏప్రిల్ 25 నుంచి హువావే అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో విక్రయాలకు అందుబాటులోకి రానుంది. ఐదు రంగుల్లో, నాలుగు వేరియంట్లలో ఈ ఫోన్ లభించనుంది. ధర వివరాలు 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్: CNY 10,999 (సుమారు రూ.1.5 లక్షలు) 16GB ర్యామ్ + 1TB స్టోరేజ్: CNY 13,999 (సుమారు రూ.1.91 లక్షలు)

వివరాలు

భారీ డిస్‌ప్లే, ప్రీమియం డిజైన్

ఈ ఫోల్డబుల్ ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో, HarmonyOS 6.1పై పనిచేస్తుంది. 7.7 అంగుళాల LTPO 2.0 ఫ్లెక్సిబుల్ OLED మెయిన్ డిస్‌ప్లే 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ గరిష్టంగా 3,000 నిట్స్ బ్రైట్‌నెస్ అదే సమయంలో 5.4 అంగుళాల కవర్ డిస్‌ప్లే (Kunlun OLED) కూడా ఉంది. ఇది 3,500 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ అందిస్తుంది.

వివరాలు

శక్తివంతమైన ప్రాసెసర్

ఈ ఫోన్‌కు హువావే సొంత Kirin 9030 Pro చిప్‌సెట్‌ను అమర్చింది. CPU పనితీరు 25% మెరుగుదల GPU పనితీరు 40% పెరుగుదల NPU పనితీరు 70% అధికంగా అలాగే గరిష్టంగా 16GB ర్యామ్, 1TB స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. కనెక్టివిటీ ఫీచర్లు ఈ డివైస్ 5G, LTE నెట్‌వర్క్‌లకు సపోర్ట్ చేస్తుంది. అదనంగా బ్లూటూత్ 6, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, USB టైప్-C, GPS, GLONASS, BeiDou, గెలీలియో, QZSS, NavIC వంటి అన్ని ఆధునిక కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.

Advertisement

వివరాలు

కెమెరా & బ్యాటరీ

ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP మెయిన్ కెమెరా (f/1.4-f/4.0 వేరియబుల్ అపర్చర్, OIS) 50MP పెరిస్కోప్ టెలిఫోటో (OIS, 100x డిజిటల్ జూమ్) 12.5MP అల్ట్రావైడ్ కెమెరా సెల్ఫీల కోసం ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లేల్లో 8MP కెమెరాలు ఉన్నాయి.

Advertisement