Page Loader
WWDC 2025: 'లిక్విడ్ గ్లాస్' డిజైన్‌తో యాపిల్ సాఫ్ట్‌వేర్‌లో భారీ మార్పులు
'లిక్విడ్ గ్లాస్' డిజైన్‌తో యాపిల్ సాఫ్ట్‌వేర్‌లో భారీ మార్పులు

WWDC 2025: 'లిక్విడ్ గ్లాస్' డిజైన్‌తో యాపిల్ సాఫ్ట్‌వేర్‌లో భారీ మార్పులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 09, 2025
11:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్ తన సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం భారీ డిజైన్ మార్పును తీసుకొచ్చింది. 'లిక్విడ్ గ్లాస్' పేరుతో తాజా డిజైన్ లాంగ్వేజ్‌ను WWDC 2025లో విడుదల చేసింది. ఈ డిజైన్‌ మార్పులు iOS, macOS, iPadOS అంతటా వ్యాప్తి చెందనున్నాయి. అప్లికేషన్‌ల ఇంటర్‌ఫేస్‌లకు పారదర్శకత, గ్లాస్ ప్రభావాలు అందించేందుకు రూపొందించిన ఈ డిజైన్‌ను 'యాపిల్ VP ఆఫ్ హ్యూమన్ ఇంటర్‌ఫేస్ అలెన్ డై'లో పరిచయం చేశారు. ఇది యాపిల్‌ చరిత్రలోనే అత్యంత విశాలమైన డిజైన్ మార్పుగా చెప్పొచ్చు

Details

స్క్యూయోమార్ఫిజం నుంచి పూర్తి వైవిధ్యం

యాపిల్ గతంలో వినియోగించిన డిజైన్ శైలులకు భిన్నంగా, డాక్‌, లాక్‌స్క్రీన్‌ వంటి భాగాల్లో లిక్విడ్ గ్లాస్ ఎలిమెంట్స్‌ను చేర్చింది. యాపిల్ గతంలో 2000లో iMovie 2, 2001లో Mac OS X 10.0లో ఉపయోగించిన 'అక్వా' గ్లాస్ థీమ్‌ను గుర్తుకు తెస్తుంది. కానీ ఈసారి మరింత ఆధునికంగా, అన్ని పరికరాలపై ఏకరూపతతో వస్తోంది. కొత్త డిజైన్‌తో ఏం మారనుంది లిక్విడ్ గ్లాస్ ఇంటర్‌ఫేస్ పూర్తిగా 'సెమీ-ట్రాన్స్‌పరెంట్' ఉంటుంది. ఇది వాస్తవ గాజును పోలినట్లు వ్యవహరిస్తుంది. మీ కంటెంట్‌ ఆధారంగా రంగు మారుతుంది. లైట్ మోడ్‌, డార్క్ మోడ్‌తో పాటు 'క్లియర్ మోడ్' అనే కొత్త థీమ్‌ కూడా అందుబాటులోకి రానుంది.

Details

అధునాతన ఫీచర్లు ఇవే

అలెర్ట్స్ : మీరు టాప్ చేసిన ప్రదేశం నుంచే అలెర్ట్స్‌ వెలువడతాయి. కాంటెక్స్ట్ మెనూలు : స్క్రోల్ చేసినప్పుడు అవి సులభంగా స్కాన్ చేయగలిగే విధంగా విస్తరిస్తాయి. లాక్ స్క్రీన్, నోటిఫికేషన్స్, కంట్రోల్ సెంటర్, యాప్ ఐకాన్లు అన్ని భాగాల్లో ఈ డిజైన్ వాడకాన్ని చూస్తాము.

Details

Vision Pro ప్రేరణతో రూపుదిద్దుకున్న డిజైన్

యాపిల్ Vision Pro హెడ్‌సెట్ నుంచి స్ఫూర్తి పొందిన డిజైన్ ఇది. దీంతో భవిష్యత్తులో యాపిల్ OSలు ఫోన్‌, ట్యాబ్లెట్‌, వాచ్‌లకే కాకుండా ఇతర ఉపరితలాలపై కూడా పని చేసే అవకాశం ఉందని సూచనగా భావించవచ్చు. ఈ భారీ డిజైన్ మార్పులతో డెవలపర్లు తమ యాప్‌లను ఈ నూతన లుక్‌కు తగినట్లుగా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యాప్ ఐకాన్లు కూడా బహుళ లేయర్ల లిక్విడ్ గ్లాస్‌తో రూపొందించినట్టు కనిపించనున్నాయి. యాపిల్ దశాబ్దాల తర్వాత డిజైన్ పరంగా తీసుకున్న ఈ ప్రణాళిక ప్రపంచవ్యాప్తంగా యూజర్ల అనుభూతిని కొత్త స్థాయికి తీసుకెళ్లనుంది.