సూర్యుని నుండి భారీ ముక్క విరగడంతో ఆశ్చర్యంలో శాస్త్రవేత్తలు
సూర్యుడు ఎప్పుడూ ఖగోళ శాస్త్రవేత్తలకు ఒక అద్భుతమే. ఇప్పుడు, అయితే ఒక కొత్త పరిణామం శాస్త్రవేత్తలను కలవరపెట్టింది. సూర్యుని నుండి భారీ ముక్క దాని ఉపరితలం నుండి విడిపోయింది . శాస్త్రవేత్తలు ఇది ఎలా జరిగిందో విశ్లేషించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా తెలిసిందని గత వారం అంతరిక్ష వాతావరణ సూచనకర్త అయిన డాక్టర్ తమితా స్కోవ్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. సూర్యుడు సౌర జ్వాలను విడుదల చేస్తూనే ఉంటాడు, ఇవి కొన్నిసార్లు భూమిపై కమ్యూనికేషన్‌లను ప్రభావితం చేస్తాయి, అందుకే శాస్త్రవేత్తలు తాజా సంఘటన గురించి మరింత ఆందోళన చెందుతున్నారు.
ఆ గాలి వేగం సెకనుకు 96 కిలోమీటర్లు లేదా సెకనుకు 60 మైళ్లు
సుడిగాలి గురించి మరిన్ని పరిశీలనల కోసం సుమారుగా 60 డిగ్రీల అక్షాంశంలో ఆ ధ్రువాన్ని చుట్టుముట్టడానికి దాదాపు 8 గంటల సమయం పట్టిందని వెల్లడి చేసింది. ఈ సంఘటనలో ఆ గాలి వేగం సెకనుకు 96 కిలోమీటర్లు లేదా సెకనుకు 60 మైళ్లు. అని డాక్టర్ స్కోవ్ తదుపరి ట్వీట్‌లో తెలిపారు. దశాబ్దాలుగా సూర్యుడిని గమనిస్తున్న US నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్‌కు చెందిన సౌర భౌతిక శాస్త్రవేత్త స్కాట్ మెక్‌ఇంతోష్ మాట్లాడుతూ, సౌర వాతావరణంలో విడిపోయినప్పుడు సంభవించిన "సుడిగుండం" తాను ఎన్నడూ చూడలేదని చెప్పారు. అంతరిక్ష శాస్త్రవేత్తలు ఈ వింత సంఘటన గురించి మరిన్ని వివరాలను సేకరించడానికి, స్పష్టమైన చిత్రాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నారు.