
సూర్యుడు ఇచ్చే సంకేతాల ద్వారా శాస్త్రవేత్తలకు సౌర జ్వాల గురించి తెలిసే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
సౌర జ్వాల ఎక్కడ, ఎప్పుడు మొదలవుతాయో అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కొత్త మార్గాన్ని కనుగొన్నారు. సూర్యుని శిఖ నుండి వచ్చే సంకేతాలు సూర్యునిలో ఏ ప్రాంతాలు సౌర జ్వాలను విడుదల చేయడానికి ఎక్కువ అవకాశం ఉందో గుర్తించడంలో సహాయపడతాయి. ఈ కొత్త అధ్యయనం అంతిమంగా సౌర జ్వాల, అంతరిక్షంలో తుఫానులపై అంచనా వేసే అవకాశమిస్తుంది.
తీవ్రమైన సౌర జ్వాల భూమిపై రేడియో కమ్యూనికేషన్ సిస్టమ్‌లు, నావిగేషన్ సిగ్నల్స్, ఎలక్ట్రిక్ పవర్ గ్రిడ్‌లను దెబ్బతీయడమే కాక అంతరిక్ష నౌకలు, వ్యోమగాములకు కూడా ముప్పు కలిగిస్తుంది. ఇటీవల, అక్టోబర్ 2022లో, సన్‌స్పాట్ AR3110 నుండి సౌర జ్వాల కమ్యూనికేషన్ సిస్టమ్‌లను దెబ్బతీసింది. USలోని హరికేన్ ప్రభావిత ప్రాంతాలలో రెస్క్యూ ఆపరేషన్‌లకు ఆటంకం కలిగించింది
సూర్యుడు
శాస్త్రవేత్తలు సూర్యుని శిఖను అధ్యయనం చేయడం ద్వారా భిన్నమైన సమాచారాన్ని పొందారు
ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ వంటి వాటిలో చురుకైన ప్రాంతాల నుండి ప్రారంభమైన ఈ జ్వాలను గురించి అధ్యయనం చేశారు.
సూర్యుని ఉపరితలం నుండి పొందే సమాచారం కంటే చాలా భిన్నమైన సమాచారాన్ని సూర్యుని శిఖను అధ్యయనం చేయడం ద్వారా పొందామని కొత్త అధ్యయన ప్రధాన రచయిత కెడి లెకా అన్నారు.
అధ్యయనం కోసం, నాసా శాస్త్రవేత్తలు సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ (SDO) సహాయంతో సూర్యుని క్రియాశీల ప్రాంతాల ఇమేజ్ డేటాబేస్‌ను ఉపయోగించారు. డేటాబేస్ లో అతినీలలోహిత కాంతిలో తీసిన ఎనిమిది సంవత్సరాల చిత్రాలు ఉన్నాయి.
సైంటిఫిక్ కమ్యూనిటీకి ఈ రకమైన డేటాబేస్ అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి అని నార్త్‌వెస్ట్ రీసెర్చ్ అసోసియేట్స్ (NWRA)కి చెందిన కరిన్ డిస్సౌర్ తెలిపారు.