Page Loader
2023 లో ఇస్రో చేయబోతున్న ప్రయోగాలు
ఇప్పటి వరకు 385 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించింది

2023 లో ఇస్రో చేయబోతున్న ప్రయోగాలు

వ్రాసిన వారు Nishkala Sathivada
Dec 31, 2022
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

2023 లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, భూమిని పరిశోధించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. అక్టోబర్ 2022 నాటికి USA, జర్మనీ, కెనడా, స్వీడన్‌తో సహా 34 దేశాల కోసం దాదాపు 385 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. ఇప్పుడు 2023 లో జరపబోయే మిషన్ల గురించి తెలుసుకుందాం. ఆదిత్య-L1: అనేక భారతీయ పరిశోధనా సంస్థల సహకారంతో అభివృద్ధి చేయబడిన మొదటి అబ్జర్వేటరీ-క్లాస్ సోలార్ స్పేస్ మిషన్.1,500 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని సూర్య-భూమి వ్యవస్థలోని మొదటి లాగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉంచుతారు. విద్యుదయస్కాంత మరియు పార్టికల్ డిటెక్టర్‌లను ఉపయోగించి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్య గ్రహం బయటి పొరలను పరిశీలించడానికి ఆన్‌బోర్డ్‌లో ఏడు పేలోడ్‌లు ఉంటాయి.

ఇస్రో

మొట్టమొదటిసారిగా అంతరిక్ష కక్ష్యలోకి ముగ్గురు వ్యోమగాములు

చంద్రయాన్-3: ఆగస్టు 2023లో ప్రారంభం కానుంది. డిజైన్ మరియు ఇంజనీరింగ్ పరంగా చంద్రయాన్-2 కన్నా మెరుగ్గా ఉంటుంది. గగన్‌యాన్-3: వ్యోమగాములను 400 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) భాగస్వామ్యంతో గగన్‌యాన్-3 ISRO ఆధ్వర్యంలో సిబ్బంది ఉన్న మొట్టమొదటి మిషన్. ముందు రెండు మిషన్లు-గగన్‌యాన్-1, గగన్‌యాన్-2- సిబ్బంది లేని పరీక్షా విమానాలు. ఇందులో మాత్రం ముగ్గురు వ్యోమగాములను పంపుతున్నారు. ఇంకా ఈ లిస్ట్ లో XPoSat (X-ray Polarimeter శాటిలైట్), శుక్రుని మీద మొదటి ఆర్బిటర్ మిషన్ శుక్రయాన్-1, ప్రపంచ పర్యావరణ మార్పులపై సమాచారాన్ని అందించే NISAR వంటి మిషన్లు ఉన్నాయి.