Loading...
Humanoid Robot: మనిషిపై తిరగబడిన హ్యూమనాయిడ్ రోబో.. వైరల్‌గా మారిన వీడియో
మనిషిపై తిరగబడిన హ్యూమనాయిడ్ రోబో.. వైరల్‌గా మారిన వీడియో

Humanoid Robot: మనిషిపై తిరగబడిన హ్యూమనాయిడ్ రోబో.. వైరల్‌గా మారిన వీడియో

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2026
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాలోని ఓ ఎలక్ట్రానిక్స్‌ షోరూంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. అక్కడ ప్రదర్శనకు ఉంచిన ఓ మానవరూప రోబో (హ్యూమనాయిడ్‌)ను ఓ వ్యక్తి నెట్టడంతో.. అది అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం 'ది టెర్మినేటర్‌'లోని సన్నివేశాలను గుర్తు చేసేలా ఈ దృశ్యాలు ఉండటంతో నెటిజన్లు దీనిపై పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు.

వివరాలు 

నెట్టగానే కాలు ఎత్తిన రోబో..

'ఎక్స్‌'లో షేర్‌ అయిన వీడియో ప్రకారం.. నలుపు రంగు టీ-షర్ట్‌ వేసుకున్న ఓ వ్యక్తి షోరూంలో ఏర్పాటు చేసిన రోబో దగ్గరకు వెళ్లాడు.

అనంతరం దాన్ని చేతులతో ముందుకు నెట్టాడు. వెంటనే రోబో తన కాలును అతడి దిశగా కదిలిస్తూ.. తన్నేందుకు ప్రయత్నించినట్లు వీడియోలో కనిపించింది.

చుట్టుపక్కల ఉన్నవారు ఆశ్చర్యంగా చూస్తుండగానే ఆ యంత్రం తన కదలికలను కొనసాగించింది.

పరిస్థితి అదుపు తప్పేలా కనిపించడంతో చివరకు రోబోను స్విచ్ఛాఫ్‌ చేసినట్లు సంబంధిత పోస్టులో పేర్కొన్నారు. దీంతో అక్కడి పరిస్థితి సద్దుమణిగింది.

వివరాలు 

రోబోకు 'కోపం' వచ్చిందా?

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

భవిష్యత్తులో కృత్రిమ మేధ, రోబోటిక్‌ యంత్రాలు మనుషులపై ప్రతీకారం తీర్చుకునే పరిస్థితులు రావచ్చంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

'మనిషి అహంకారం చివరకు రోబోలకు కూడా కోపం తెప్పించింది' అని ఓ నెటిజన్‌ స్పందించగా.. 'రోబోలకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది.. మరీ ఎక్కువగా కెలికితే ఇలాగే జరుగుతుంది' అంటూ మరో వ్యక్తి వ్యాఖ్యానించాడు.

ADVERTISEMENT

వివరాలు 

వీడియో నిజమేనా?

అయితే ఈ దృశ్యాలపై కొందరు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

రోబో తనంతట తానే స్పందించిందా? లేక ఎవరైనా రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా దాన్ని నడిపించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ విషయంపై ఇప్పటివరకు స్పష్టత రావాల్సి ఉంది.

అందువల్ల వీడియోలో కనిపించిన ఘటనను బట్టి మాత్రమే రోబో స్వతంత్రంగా మనిషిపై దాడి చేసిందని నిర్ధారించలేమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మనిషిపై దాడికి యత్నించిన హ్యూమనాయిడ్

ADVERTISEMENT