LOADING...
ChatGPT: ఏఐ వచ్చాక మారుతున్న మనుషుల మాటల శైలి.. తాజా అధ్యయనంలో సంచలన వెల్లడి
ఏఐ వచ్చాక మారుతున్న మనుషుల మాటల శైలి.. తాజా అధ్యయనంలో సంచలన వెల్లడి

ChatGPT: ఏఐ వచ్చాక మారుతున్న మనుషుల మాటల శైలి.. తాజా అధ్యయనంలో సంచలన వెల్లడి

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 08, 2025
03:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

చాట్‌జీపీటీ లాంటి ఏఐ టూల్స్ వచ్చాక మనం మాట్లాడే తీరులోనే మార్పు వస్తోందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇప్పటివరకు ఏఐ వల్ల ఇంటర్నెట్‌లో యాంత్రిక రచనలు పెరుగుతాయన్న భయం ఉండగా, ఇప్పుడు మనుషులే చాట్‌బాట్‌లా మాట్లాడడం మొదలుపెట్టారని పరిశోధకులు చెబుతున్నారు. మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ చేసిన స్టడీ ప్రకారం,యూట్యూబ్‌లో సాధారణంగా వినిపించని 'అండర్‌స్కోర్‌, కాంప్రిహెండ్‌, మెటిక్యులస్‌, బోల్స్టర్‌' లాంటి పదాలు ఎవరో చెప్పినట్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇది చాట్‌జీపీటీ విస్తృతంగా వాడుకలోకి వచ్చిన కాలానికి సరిపోవడంతో, తెలియకుండానే మనుషులు ఏఐ వాడే భాషనే తమ మాటల్లోకి తెచ్చుకుంటున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు,ప్రముఖ రెడిట్ కమ్యూనిటీల మోడరేటర్లు కూడా చాలా పోస్టులు ఏఐ రాసినట్టే కనిపిస్తున్నాయని చెబుతున్నా,కానీ అవి నిజమైన మనుషులే రాస్తున్నారని తెలుస్తోంది.

వివరాలు 

ఒక్కరోజులోనే 26 సార్లు వినిపించిన 'ఐ రైస్ టు స్పీక్'

భావోద్వేగాలతో ఉండాల్సిన కథనాలు కూడా చక్కగా పాలిష్ చేసిన ప్యారాగ్రాఫ్‌లుగా మారిపోవడం చూస్తున్నామని తెలిపారు. ఏఐ మనుషుల నుంచి నేర్చుకుంటోంది, మనుషులు మళ్లీ ఆన్‌లైన్‌లో చూసి ఆ శైలినే అనుకరిస్తున్నారు,దీంతో రెండింటి మధ్య తేడా క్రమంగా చెరిగిపోతోందని వారు అంటున్నారు. బ్రిటన్ పార్లమెంట్‌లో 'ఐ రైస్ టు స్పీక్' అనే వాక్యం ఒక్కరోజులోనే 26 సార్లు వినిపించడాన్ని కూడా పరిశీలకులు గమనించారు.

వివరాలు 

ఏఐ తరచూ ఉపయోగించే పదప్రయోగం

ఈ పదబంధం అమెరికన్ రాజకీయ శైలిలో ఎక్కువగా ఉండటంతో పాటు ఏఐ తరచూ ఉపయోగించే పదప్రయోగం కావడం గమనార్హం. అలాగే స్టార్బక్స్ కొన్ని దుకాణాలు మూసివేసినప్పుడు తలుపులపై పెట్టిన నోటీసుల్లో కూడా ఏఐ రాసినట్టుగా అనిపించే అతిగా భావోద్వేగ భాష కనిపించిందని చెబుతున్నారు. అవి ఏఐ రాశాయా, మనుషుల రాశాయా అన్న అయోమయమే ఇప్పుడు అసలు సమస్యగా మారింది. మొత్తం మీద మనుషులను ఏఐ పూర్తిగా భర్తీ చేయకపోయినా, మన మాటల శైలి మాత్రం క్రమంగా ఏఐలాగే మారుతోందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.

Advertisement