Gleeden: డేటింగ్ యాప్‌లో హైదరాబాద్ సెన్సేషన్.. యూజర్ల సంఖ్యలో టాప్ ర్యాంక్!
ఈ వార్తాకథనం ఏంటి
వివాహేతర సంబంధాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫ్రెంచ్ డేటింగ్ యాప్ 'గ్లీడెన్' భారత్‌లో వేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ యాప్ వినియోగదారుల సంఖ్య 40 లక్షల (4 మిలియన్లు) మైలురాయిని దాటిందని కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా టెక్ హబ్‌లుగా పేరొందిన బెంగళూరు, హైదరాబాద్ నగరాలు ఈ జాబితాలో అగ్రస్థానాల్లో నిలవడం విశేషం. గ్లీడెన్ వెల్లడించిన గణాంకాల ప్రకారం మొత్తం యూజర్లలో 18 శాతం వాటాతో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, 17 శాతం వినియోగదారులతో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో ఢిల్లీ (11%), ముంబై (9%), పుణె (7%) నగరాలు నిలిచాయి.
వివరాలు
యాప్ వినియోగం క్రమంగా పెరుగుతోంది
ఇక మెట్రో నగరాలకే పరిమితం కాకుండా లక్నో, చండీగఢ్, సూరత్ వంటి టైర్-2 నగరాల్లో కూడా ఈ యాప్ వినియోగం క్రమంగా పెరుగుతోందని కంపెనీ పేర్కొంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో పురుషుల వినియోగం 65 శాతం ఉండగా, మహిళల వాటా 35 శాతంగా నమోదైంది. అయితే గత రెండేళ్లలో మహిళా వినియోగదారుల సంఖ్య 148 శాతం పెరగడం గమనించదగ్గ విషయం. భారత్‌లో 40 లక్షల యూజర్ల మైలురాయిని చేరుకోవడం మా కోసం కీలక ఘట్టం. ఆధునిక సంబంధాలపై ప్రజల దృక్పథంలో వస్తున్న నిశ్శబ్ద మార్పుకు, డిజిటల్ వినియోగం పెరుగుదలకు ఇది స్పష్టమైన సంకేతమని గ్లీడెన్ ఇండియా కంట్రీ మేనేజర్ సిబిల్ షిడెల్ తెలిపారు.