HypeD Sanvaadini App: స్వదేశీ 'హైప్డ్ సంవాదిని' యాప్.. డిజిటల్ భద్రతకు కొత్త మార్గం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం ప్రపంచం పూర్తిగా డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టింది. ఇంటర్నెట్ వల్ల మన జీవితాలు, పనులు ఎంతో సులభతరమయ్యాయి. ఇంట్లో నుంచే దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులతో మాట్లాడటం, పనులు నిర్వహించడం సులువైంది. ఒకప్పుడు గంటలు పట్టే పనులు ఇప్పుడు నిమిషాల్లో పూర్తవుతున్నాయి. అయితే ఈ డిజిటల్ విప్లవంతో పాటు సైబర్ మోసాలు, ఆన్‌లైన్ ఫ్రాడ్లు, డిజిటల్ అరెస్టులు వంటి ఘటనలు కూడా పెరుగుతున్నాయి. ఇవే ఇప్పుడు డిజిటల్ కమ్యూనికేషన్‌కు పెద్ద సవాలుగా మారాయి. ముఖ్యంగా అసురక్షిత డిజిటల్ అప్లికేషన్‌ల వినియోగం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. విదేశీ సంస్థలు నిర్వహిస్తున్న డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు పూర్తిగా భద్రత కల్పించలేకపోతున్నాయనే అభిప్రాయం పెరుగుతోంది.
వివరాలు
స్వదేశీ పరిష్కారంగా 'హైప్డ్ సంవాదిని', 'దేశీ ఏఐ GenZ కీబోర్డ్'
దీంతో భారతీయ వినియోగదారుల డేటా, గోప్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితి జాతీయ భద్రతపైనా ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనువాదిని ఏఐ సంస్థ పూర్తిగా స్వదేశీ, సురక్షిత డిజిటల్ పరిష్కారాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైప్డ్ సంవాదిని మెసెంజర్‌తో పాటు దేశీ ఏఐ GenZ కీబోర్డ్ యాప్‌ను అభివృద్ధి చేసి అధికారికంగా ప్రారంభించింది. ప్రస్తుతం 80 కోట్లకు పైగా భారతీయులు విదేశీ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌లపై ఆధారపడుతున్న పరిస్థితిలో, డేటా భద్రత, గోప్యత, భాషా సమ్మిళితత్వం వంటి అంశాలు అత్యంత కీలకంగా మారాయి. అందుకే స్వదేశీ, భద్రతా ప్రమాణాలు కలిగిన ప్రత్యామ్నాయాల అవసరం పెరిగింది.
వివరాలు
హైప్డ్ సంవాదిని అంటే ఏమిటి?
అనువాదిని ఏఐ సీఈఓ డాక్టర్ బుద్ధ చంద్రశేఖర్ వివరాల ప్రకారం, హైప్డ్ సంవాదిని భారతదేశంలో రూపొందిన తొలి సిమ్-ఆధారిత, బహుభాషా, స్పామ్-రహిత గ్లోబల్ మెసెంజర్. ఈ యాప్‌లో డైనమిక్ చాట్ ఐడీల సౌకర్యం ఉంది. దీని ద్వారా వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌ను షేర్ చేయకుండా వ్యక్తిగత చాట్‌లు, గ్రూప్ చాట్‌లు, ఆడియో, వీడియో కాల్‌లు చేసుకోవచ్చు. భద్రతపరంగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, డివైస్ బైండింగ్, అధునాతన యాంటీ-స్పామ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి సైబర్ నేరాలు, ఫేక్ అకౌంట్లు, మోసాల నుండి వినియోగదారులను రక్షిస్తాయి.
వివరాలు
హైప్డ్ సంవాదిని అంటే ఏమిటి?
ఈ ప్లాట్‌ఫారమ్‌లో 22 భారతీయ, 37 విదేశీ భాషలలో రియల్‌టైమ్ టెక్స్ట్, వాయిస్ అనువాదం అందుబాటులో ఉంది. దీంతో భాషా అవరోధాలు తగ్గి దేశీయ వైవిధ్యం డిజిటల్ స్థాయిలో కలుస్తుంది. ఇక అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే వన్-ట్యాప్ SOS ఫీచర్ కూడా ఉంది. ఇది లైవ్ లొకేషన్‌తో సహాయం అందించే విధంగా రూపొందించబడింది. మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరం. అదనంగా ప్రాంతీయ భాషలలో ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్‌లు, గిగ్ అవకాశాలు కూడా అందిస్తుంది. భాషా అభ్యాసం, గేమ్స్, కమ్యూనిటీ ఫీచర్లతో ఇది ఒక సమగ్ర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌గా మారింది.
వివరాలు
దేశీ AI GenZ కీబోర్డ్ ప్రత్యేకతలు
దేశీ ఏఐ GenZ కీబోర్డ్ ఒక ఆధునిక AI ఆధారిత టైపింగ్ ప్లాట్‌ఫారమ్. ఇది 22 భారతీయ భాషలు, 70కి పైగా విదేశీ భాషలకు మద్దతు ఇస్తుంది. వాయిస్-టు-టెక్స్ట్, తక్షణ అనువాదం వంటి ఫీచర్లతో వినియోగదారులు తమ మాతృభాషలోనే సులభంగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఇందులో జెన్‌జెడ్ స్టైల్ స్లాంగ్ షార్ట్‌కట్స్, అధునాతన టైపింగ్ కంట్రోల్స్, బహుళ లేఅవుట్లు ఉన్నాయి. యాక్సెంట్‌లు, చిహ్నాలు, కరెన్సీ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. అలాగే క్లిప్‌బోర్డ్ మేనేజర్, GIFలు, స్టిక్కర్లు, కస్టమ్ AI స్టిక్కర్లు వంటి ఫీచర్లు వినియోగదారుల అనుభవాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. ఫ్లోటింగ్ కీబోర్డ్, సైజ్ మార్చుకునే ఆప్షన్, పూర్తిగా కస్టమైజ్ చేసుకునే ఇంటర్‌ఫేస్‌తో ఇది వేగవంతంగా, యూజర్ ఫ్రెండ్లీగా పనిచేస్తుంది.