వాట్సప్‌లో సరికొత్తగా 'ఇమేజ్ క్రాప్' ఫీచర్..!
వినియోగారులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వాట్సప్ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తేస్తోంది. వినియోగదారుల అవసరాలు, భద్రతను దృష్టిలో ఉంచుకొని మరో అత్యాధునిక ఫీచర్‌తో వాట్సప్ ముందుకొస్తోంది. వాట్సప్ లో ఫోటోలను మనకు నచ్చినట్లుగా క్రాప్ చేసుకునేలా మరో కొత్త ఫీచర్ త్వరలో వాట్సప్ లో దర్శనమివ్వనుంది. దీనికి సంబంధించిన టూల్ ను వాట్సప్ అభివృద్ధి చేస్తోంది. స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్, డెస్క్ టాప్ ల్లోనే ఫోటోలను మనకు ఇష్టమైన రీతిలో క్రాప్ చేసి, వాట్సప్ లో షేరే చేసుకుంటూ ఉంటాం. ప్రస్తుతం నేరుగానే వాట్సప్ లోనే క్రాప్ చేసుకొనే అవకాశం ఆ సంస్థ కల్పించింది.
త్వరలో అందుబాటులోకి ఈ కొత్త ఫీచర్
వాట్సప్ ను ఓపెన్ చేసిన వెంటనే క్రాప్ చేయాల్సిన ఇమేజ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం పైన చూపిన ఫోటోలో మాదిరిగా ఫోటో పై భాగంలో కనిపించే ఐకన్స్ యారో మార్క్ చూపిస్తున్న క్రాప్ ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఫోటోను మనకు నచ్చిన సైజ్ లో క్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రాప్ చేసిన వెంటనే ఇ ఫోటోను ఫార్వర్డ్ చేయవచ్చు. దీనివల్ల యూజర్ కి చాలా సమయం ఆదా అవుతుంది. ఇమేజెస్ ను క్రాప్ చేయడం కోసం వేరే టూల్ వాడాల్సిన అవసరం యూజర్లకు ఉండదు. త్వరలో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ వెల్లడించింది.