ఇక వాట్సప్‌లో సులభంగా హెచ్‌డి ఫోటోస్ షేర్ చేసే అవకాశం
వాట్సప్ మెసేజింగ్ యాప్‌ను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఉపయోగిస్తున్నారు. స్నేహితులు, బంధువులకు ఏదైనా చెప్పాలనుకుంటే త్వరగా వాట్సప్ లో సందేశం పంపొచ్చు. ముఖ్యంగా ఫోటో, లేదా వీడియో పంపించాలనుకుంటే వాట్సప్ చాలా అనుకూలమైన మార్గం. గతంలో హై క్వాలిటీ ఫోటోలను పంపించాలంటే కొంచెం సమస్యగా ఉండేది. ప్రస్తుతం HD ఫోటోలను కొలతలతో సహా పంపించడానికి వాట్సప్ ఓ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. చాలా కాలం వరకు వినియోగదారులు HD చిత్రాలను ఇమెయిల్, బ్లూటూత్ ద్వారా ఇతరులకు పంపడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాల్సి వచ్చింది.
హైక్వాలిటీ ఫోటోలను ఎంపిక చేసుకొనే అవకాశం
హై క్వాలిటీ ఫోటోను ఇతరులకు పంపించే సమయంలో స్క్రీన్ పై 'ఫోటో నాణ్యత' అనే కొత్త అప్షన్ కనిపిస్తుంది. ఇందులో రెండు ఆప్షన్ ఉంటాయి. ప్రామాణిక నాణ్యత (1600x1052), HD నాణ్యత (4096x2692) గా కనిపిస్తుంది. ఇందులో మనం ఎది కావాలంటే దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అదే విధంగా అన్ని చిత్రాలకు "ప్రామాణిక నాణ్యత" అనేది డిఫాల్ట్ ఎంపిక చేసుకొనే అవకాశం ఉంటుంది. నాణ్యత గల ఫోటోలను పంపేటప్పుడు ప్రతిసారి "HD"ని మాన్యువల్‌గా ఎంచుకోవాల్సి ఉంటుంది. భవిష్యతులో వాట్సప్ మరెన్నో ప్రత్యేక ఫీచర్లు తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది.