
Sam Altman: ఏఐ వాడకంలో భారత్ ముందంజ.. ప్రపంచాన్ని దాటేస్తోందంటున్న సీఈఓ శామ్ ఆల్ట్‌మన్
ఈ వార్తాకథనం ఏంటి
ఓపెన్‌ఏఐ (OpenAI) అభివృద్ధి చేసిన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ (ChatGPT) యూజర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
కొత్త మోడళ్లు, ఆధునిక ఫీచర్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఈ సేవలను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. కృత్రిమ మేధ (AI) టెక్నాలజీని భారత్ వేగంగా స్వీకరిస్తుండటంపై కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
ఈ విషయాన్ని 'ఎక్స్' వేదికగా పంచుకుంటూ, భారత పురోగతిపై ప్రశంసలు కురిపించారు.
భారత్ ఏఐ రంగాన్ని అత్యధిక వేగంతో స్వీకరిస్తోందని, ప్రపంచాన్ని దాటేస్తున్నదని ఆల్ట్‌మన్ పేర్కొన్నారు. సృజనాత్మకతతో కూడిన ఈ ప్రగతి చూడటానికి అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు.
Details
జీబ్లీకి భారీ ఆదరణ
ఈ వ్యాఖ్యలు చాట్‌జీపీటీ ఇమేజ్ జనరేషన్ టూల్ జీబ్లీ (Gibby)కి వచ్చిన భారీ ఆదరణ నేపథ్యంలో వచ్చాయి. 26 నెలల క్రితం చాట్‌జీపీటీ ప్రారంభించినప్పుడు అద్భుతమైన స్పందన వచ్చిందని ఆల్ట్‌మన్ తెలిపారు.
కేవలం ఐదు రోజుల్లోనే ఒక మిలియన్ మంది యూజర్లు చేరారని గుర్తు చేశారు.
అయితే తాజాగా జీబ్లీ ఫిల్టర్ విడుదలైన తర్వాత కేవలం ఒక గంటలోనే 10 లక్షల మంది కొత్త యూజర్లు చాట్‌జీపీటీని ఉపయోగించడం ప్రారంభించారని వెల్లడించారు.