Loading...
NASA: నాసా అద్భుత దృశ్యాలు.. నగరాల వెలుగులతో మెరిసిపోయిన భారతదేశం!
నాసా అద్భుత దృశ్యాలు.. నగరాల వెలుగులతో మెరిసిపోయిన భారతదేశం!

NASA: నాసా అద్భుత దృశ్యాలు.. నగరాల వెలుగులతో మెరిసిపోయిన భారతదేశం!

వ్రాసిన వారు Moogati Shabari
Jul 26, 2026
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతరిక్షం నుంచి రాత్రి వేళలో భారతదేశం ఎంత అందంగా కనిపిస్తుందో చూపిస్తూ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) ఓ అద్భుతమైన టైమ్‌లాప్స్‌ వీడియోను విడుదల చేసింది. వీడియోలో ప్రకృతి సృష్టించిన అపూర్వ దృశ్యాలతో పాటు భారతదేశం, శ్రీలంక తీరప్రాంతాల రాత్రి అందాలు అద్భుతంగా రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్‌ అవుతోంది. వీడియోలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించి, దక్షిణ భారతదేశం, శ్రీలంక ప్రాంతాలను దాటి బంగాళాఖాతం వైపు సాగుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఈ ప్రయాణ సమయంలో మన్నార్‌ సింధు శాఖ, బంగాళాఖాతం తీర ప్రాంతాలపై ఉరుములు, మెరుపులతో కూడిన మేఘాలు ఆకాశాన్ని ప్రకాశవంతం చేశాయి.

వివరాలు

విద్యుత్‌ దీపాల వెలుగుల్లో దేశం..

ఒకవైపు నగరాల విద్యుత్‌ దీపాల వెలుగులు, మరోవైపు ఆకాశంలో మెరుస్తున్న తుపాను మెరుపులు కలిసి భారతదేశం, శ్రీలంక తీర ప్రాంతాలను ఓ అద్భుతమైన దృశ్య ప్రపంచంలా ఆవిష్కరించాయి.

ఈ అరుదైన దృశ్యాలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వీడియోను విస్తృతంగా పంచుకుంటున్నారు.

కాగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) భూమికి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటుంది.

అక్కడి నుంచి చిత్రీకరించిన ఈ వీడియో భూమి అందాలను మరో కోణంలో చూపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.

ADVERTISEMENT