India AI Impact Summit: భారత్‌ను ప్రపంచ ఏఐ శక్తిగా మార్చేందుకు IndiaAI మిషన్
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశాన్ని ప్రపంచ కృత్రిమ మేధస్సు (AI) శక్తి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ మిషన్‌ను వేగంగా అమలు చేస్తోంది. 2026 కేంద్ర బడ్జెట్‌లో ఈ మిషన్‌కు రూ. 1,000 కోట్ల నిధులు కేటాయించటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది కేవలం సాంకేతిక అభివృద్ధికే పరిమితం కాకుండా, సమాజంలోని అన్ని వర్గాలను భాగస్వాముల్ని చేసే ఒక సమగ్ర విప్లవంగా ప్రభుత్వం భావిస్తోంది.
Details
ఫిబ్రవరిలో AI ఇంపాక్ట్ సమ్మిట్
ఫిబ్రవరి 16 నుంచి 20, 2026 వరకు న్యూదిల్లీలో AI ఇంపాక్ట్ సమ్మిట్ జరగనుంది. ఇది గ్లోబల్ సౌత్‌లో నిర్వహిస్తున్న తొలి భారీ స్థాయి AI సమ్మిట్ కావడం విశేషం.
ఈ సమ్మిట్ మూడు ప్రధాన లక్ష్యాలపై దృష్టి సారించనుంది.
ప్రజలు
మానవ అభివృద్ధికి తోడ్పడే, బహుభాషా, అందరికీ అందుబాటులో ఉండే AI వ్యవస్థల రూపకల్పన
భూమి
సహజ వనరుల స్థిర వినియోగం, వాతావరణ మార్పుల సమస్యలకు AI పరిష్కారాలు
పురోగతి
ప్రపంచ ఆర్థిక వృద్ధికి AIని కీలక సాధనంగా మార్చడం
Details
ndiaAI మిషన్‌కు ఏడు కీలక స్తంభాలివే
IndiaAI మిషన్‌ను ఏడు ప్రధాన స్తంభాలపై రూపొందిస్తున్నారు.
1. IndiaAI కంప్యూట్
స్టార్టప్‌లు, పరిశోధకులకు సరసమైన ధరల్లో GPUలు, కంప్యూటింగ్ వనరులు
2. డేటా బేస్
20కు పైగా రంగాల్లో 3,000కి మించిన స్వదేశీ డేటాసెట్‌ల అభివృద్ధి
3.ప్రాథమిక AI నమూనాలు
భారతీయ భాషలు, సంస్కృతికి అనుగుణంగా 'సావరిన్ AI' మోడళ్ల రూపకల్పన
4. నైపుణ్య అభివృద్ధి
లక్షలాది మంది విద్యార్థులకు AI శిక్షణ, స్కాలర్‌షిప్‌లు
5. అప్లికేషన్ అభివృద్ధి
ఆరోగ్యం, వ్యవసాయం, పాలన వంటి కీలక రంగాల్లో AI వినియోగం
6.స్టార్టప్ నిధులు
కొత్త AI స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం, గ్లోబల్ మార్కెట్ ప్రాప్యత
7.సురక్షితమైన AI
నైతికత, విశ్వసనీయతతో కూడిన AI వినియోగానికి మార్గదర్శకాలు
Details
అభివృద్ధి + సమాజం = IndiaAI విజన్
IndiaAI మిషన్ ద్వారా అభివృద్ధి, సామాజిక ప్రయోజనాలు రెండింటినీ సమతుల్యం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఆయుష్మాన్ భారత్ & వ్యవసాయం
రైతులకు పంటలపై AI ఆధారిత సలహాలు, మారుమూల గ్రామాలకు డిజిటల్ ఆరోగ్య సేవల విస్తరణ
డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఆధార్, UPI తరహాలో AIని కూడా ప్రజా సేవగా తీర్చిదిద్దుతూ చిన్న వ్యాపారాలకు అందుబాటులోకి తీసుకురావడం
డేటా సార్వభౌమాధికారం
భారతీయుల డేటా భారతదేశంలోనే సురక్షితంగా నిల్వ ఉండేలా డేటా సెంటర్లకు 2047 వరకు పన్ను మినహాయింపులు
IndiaAI మిషన్ ద్వారా భారత్ టెక్నాలజీ వినియోగదారుడిగా కాకుండా, AI ఆవిష్కర్తగా ప్రపంచ వేదికపై నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యానికి ఇది ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.