Indian IT giant defies : మళ్లీ కళకళలాడుతున్నఐటి ఆఫీసులు..ఉద్యోగుల శాతం పెరుగుదల
దేశంలోని అతిపెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల ఎగుమతిదారు టిసిఎస్ కార్యాలయాల నుండి పనిచేసే ఉద్యోగుల శాతం పెరిగింది. దీనిని కరోనా ముందటి స్థాయికి చేరుకుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టిందని టాటా గ్రూప్ కంపెనీ మానవ వనరుల చీఫ్ మిలింద్ లక్కడ్ అంగీకరించారు. 18 నెలల "కఠినమైన" ప్రయత్నాల తర్వాత ఈ స్థాయిలను సాధించగలిగామని చెప్పారు. తాము వాస్తవానికి మహమ్మారికి ముందు ఉన్న సమయాల్లో దాదాపు అదే స్థాయికి వస్తున్నామని తాము విశ్వసించే స్థాయికి వచ్చామని లక్కాడ్ PTI కి చెప్పారు.
TCS ఉద్యోగుల్లో మెజార్టీ ఆఫీసు నుంచి పనికి ఆసక్తి
మొత్తం 6 లక్షల మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉన్న కంపెనీకి "ఇది ఒక రకమైన వ్యాపారం" అని పేర్కొన్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈ మెట్రిక్‌ను రాబోయే రెండు త్రైమాసికాల్లో మరింతగా పెరగవచ్చని లక్కాడ్ చెప్పారు.వారానికి ఐదు రోజుల పాటు కార్యాలయాల నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య గతంలో ప్రకటించిన 70 శాతం కంటే ఎక్కువగా ఉందని లెక్కలు చెప్పకుండానే చెప్పారు. మహమ్మారి- కారణంగా తాత్కాలికంగా మూతపడిన కంపెనీలు ఇప్పుడు కళకళలాడుతున్నాయి. లాక్‌డౌన్‌ల ఫలితంగా మొత్తం IT పరిశ్రమ సిబ్బంది ఇళ్ల వద్దే పని చేశారు. ప్రస్తుతం ఆ పరిస్ధితిని క్రమేపీ అధిగమిస్తున్నారు. దీంతో మరింత ఉత్పాదన పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
టీమ్ గా పని చేసే సంస్కృతికి ప్రోత్సాహం
టీమ్ బిల్డింగ్, మెంటరింగ్, సంస్కృతిని మరింతగా పెంచే అంశాలు మరింత దోహదం చేస్తున్నాయి. ఆ కారణంగా కార్యాలయాల నుండి పని చేయడంపై మరింత మంది ఆసక్తి చూపుతున్నారని లక్కాడ్ వివరించారు. అదే బాటలో పలు కంపెనీలు చాలా కష్టపడుతున్నాయి. వారిని తిరిగి కార్యాలయాలకు చేర్చడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి