Astronaut Anil menon: ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న వ్యోమగాములు
వ్రాసిన వారు
Moogati Shabari
Jul 15, 2026
09:44 am
ఈ వార్తాకథనం ఏంటి
ఇండో-అమెరికన్ వ్యోమగామి అనిల్ మేనన్ అంతరిక్ష యాత్రలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కు విజయవంతంగా చేరుకున్నారు. జూలై 14న ప్రారంభమైన ఈ అంతరిక్ష మిషన్‌లో అనిల్ మేనన్‌తో పాటు వ్యోమగాములు ప్యోటర్ డుబ్రోవ్, అన్నా కికినా కూడా పాల్గొన్నారు.
వివరాలు
240 రోజుల పాటు పరిశోధనలు..
ఈ ముగ్గురు వ్యోమగాములు సుమారు 240 రోజుల పాటు భూమి కక్ష్యలోని ఐఎస్‌ఎస్‌లో ఉండనున్నారు.
అక్కడ ఎనిమిది నెలల పాటు వివిధ శాస్త్రీయ పరిశోధనలు, ప్రయోగాలు నిర్వహించిన అనంతరం 2027లో భూమికి తిరిగి రానున్నారు.
భారతీయ, ఉక్రెయిన్ మూలాలు కలిగిన తల్లిదండ్రులకు జన్మించిన అనిల్ మేనన్ అమెరికా పౌరుడు.