Instagram down: ఇన్‌స్టాగ్రామ్ డౌన్.. వినియోగదారులు తీవ్ర ఇక్కట్లు
ఈ వార్తాకథనం ఏంటి
మెటా యాజమాన్యంలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ సేవలకు ఆదివారం కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా అమెరికాలోని వినియోగదారులు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొన్నారు. యాప్‌లో లాగిన్ కావడంలో, కంటెంట్ లోడ్ కావడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఔటేజ్‌లను పర్యవేక్షించే 'డౌన్‌డెటెక్టర్' వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, అమెరికా కాలమానం ప్రకారం తెల్లవారుజామున సుమారు 4:10 గంటల సమయంలో సమస్య గరిష్ఠ స్థాయికి చేరింది. ఆ సమయంలో 180 మందికిపైగా యూజర్లు ఫిర్యాదులు నమోదు చేశారు. పలువురు వినియోగదారులు యాప్‌ను ఓపెన్ చేసినప్పుడు ఎలాంటి ఎర్రర్ మెసేజ్ లేకుండా, కేవలం తెల్లటి స్క్రీన్‌పై రీఫ్రెష్ ఐకాన్ మాత్రమే కనిపిస్తోందని సోషల్ మీడియాలో స్క్రీన్‌షాట్లు షేర్ చేశారు.
Details
స్పందించని ఇన్‌స్టాగ్రామ్
డౌన్‌డెటెక్టర్ గణాంకాల ప్రకారం, ఫిర్యాదులు చేసినవారిలో 45 శాతం మందికి యాప్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యలు ఎదురవగా, 41 శాతం మందికి లాగిన్ సమస్యలు ఎదురయ్యాయి. మరో 14 శాతం మంది తమ ఫీడ్ లేదా టైమ్‌లైన్ సరిగా లోడ్ కావడం లేదని తెలిపారు. అయితే ఈ అంతరాయం ప్రభావం భారత్‌లో మాత్రం చాలా స్వల్పంగా ఉంది. దేశవ్యాప్తంగా కేవలం 10 మంది వినియోగదారులు మాత్రమే సమస్యలను ఎదుర్కొన్నట్లు డౌన్‌డెటెక్టర్ వెల్లడించింది. దీన్ని బట్టి ఈ సాంకేతిక లోపం కొన్ని ప్రాంతాలకే పరిమితమైనట్లు తెలుస్తోంది. ఈ సమస్యకు గల కారణాలపై ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.