Loading...
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్‌.. పోస్ట్ చేసిన ఫొటోలను కూడా ఎడిట్ చేయొచ్చు!
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్‌.. పోస్ట్ చేసిన ఫొటోలను కూడా ఎడిట్ చేయొచ్చు!

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్‌.. పోస్ట్ చేసిన ఫొటోలను కూడా ఎడిట్ చేయొచ్చు!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2026
01:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్న వాటిలో ఇన్‌స్టాగ్రామ్ ముందువరుసలో ఉంటుంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుండటంతో ఈ యాప్‌కు ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తున్నఅప్‌డేట్స్ ఇన్‌స్టాగ్రామ్‌ను మరింత పాపులర్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఏ చిన్న వేడుక జరిగినా,ప్రత్యేక సందర్భం వచ్చినా ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం చాలామందికి అలవాటుగా మారింది. అయితే కొన్నిసార్లు ఫొటోలను పోస్ట్ చేసిన తర్వాత అవి నచ్చకపోవచ్చు. మరింత ఆకర్షణీయంగా ఉండేలా ఫిల్టర్లు,ఎఫెక్ట్స్ జోడించాలనిపించవచ్చు. అలాగే క్యాప్షన్‌లో ఏదైనా తప్పు దొర్లితే దాన్ని సరిచేయాలని అనిపిస్తుంది. ఇప్పటివరకు ఇలాంటి మార్పులు చేయడానికి కొన్నిపరిమితులు ఉండేవి.ఈ సమస్యకు పరిష్కారంగా ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.

వివరాలు 

లొకేషన్ ట్యాగ్స్‌ను కూడా మార్చుకోవచ్చు..

ఈ ఫీచర్ ద్వారా ఇప్పటికే పోస్ట్ చేసిన ఫొటోలను కూడా మళ్లీ ఎడిట్ చేసుకోవచ్చు.

ఫొటోలకు నచ్చిన ఫిల్టర్లు, ఎఫెక్ట్స్ జోడించడంతోపాటు క్యాప్షన్‌లో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది.

అంతేకాకుండా లొకేషన్ ట్యాగ్స్‌ను కూడా మార్చుకోవచ్చు.

అంటే ఒకసారి పోస్ట్ చేసిన తర్వాత ఏదైనా తప్పు గుర్తించినా, ఆ పోస్ట్‌ను తొలగించి మళ్లీ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. నేరుగా ఎడిట్ చేసుకొని మార్పులను సేవ్ చేసుకోవచ్చు.

వివరాలు 

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలను ఎలా ఎడిట్ చేయాలి?

ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించుకోవడానికి ఈ కింది విధానాన్ని అనుసరించండి.

1. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ఓపెన్ చేయాలి.

2. అనంతరం మీ ప్రొఫైల్‌లోకి వెళ్లి,ఎడిట్ చేయాలనుకుంటున్న ఫొటో పోస్ట్‌ను ఎంపిక చేసుకోవాలి.

3. ఆ పోస్ట్‌కు కుడివైపు ఎగువ భాగంలో కనిపించే మూడు చుక్కల (Ellipsis)గుర్తుపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మెనూలోని మరిన్ని ఆప్షన్లను ఓపెన్ చేయాలి.

4. అక్కడ కనిపించే 'Edit' ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.

5. ఫొటోలో మార్పులు చేయాలంటే దానిపై ట్యాప్ చేయాలి. దీంతో ఎడిటింగ్ టూల్స్ అందుబాటులోకి వస్తాయి. వాటిని ఉపయోగించి మీకు నచ్చిన విధంగా ఫిల్టర్లు,ఎఫెక్ట్స్ జోడించుకోవచ్చు.

అవసరమైన మార్పులు చేసిన తర్వాత స్క్రీన్ కుడివైపు ఎగువ భాగంలో ఉండే 'Save' బటన్‌పై నొక్కాలి.

ADVERTISEMENT

వివరాలు 

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలను ఎలా ఎడిట్ చేయాలి?

6. ఇదే విధంగా ఫొటో క్యాప్షన్, లొకేషన్ ట్యాగ్స్‌లో కూడా మార్పులు చేసుకోవచ్చు.

7. చివరగా ఎడిట్ చేసిన పోస్ట్‌ను పరిశీలించుకోవాలి. చేసిన మార్పులు నచ్చితే అలాగే ఉంచుకోవచ్చు. ఇంకా ఏవైనా మార్పులు అవసరమని భావిస్తే మళ్లీ ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ ఫీచర్ అందుబాటులోకి రావడంతో ఫొటోలు పోస్ట్ చేసిన తర్వాత ఏవైనా తప్పులు గుర్తించినా, వాటిని సులభంగా సరిచేసుకోవచ్చు.

ప్రతి చిన్న మార్పు కోసం పాత పోస్ట్‌ను తొలగించి మళ్లీ అప్‌లోడ్ చేయాల్సిన ఇబ్బంది తప్పుతుంది.

ADVERTISEMENT