International Women's Day 2025: అంతరిక్ష పరిశోధనలో చరిత్ర సృష్టించిన భారతీయ మహిళలు వీరే..!
ఈ వార్తాకథనం ఏంటి
అంతరిక్ష పరిశోధనలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA) అగ్రగామిగా పేరొందింది.
ఇందులో ఎన్నో రంగాల్లో భారతీయ మూలాలున్న మహిళలు విశేషంగా పనిచేస్తున్నారు.
సునీతా విలియమ్స్-స్పేస్ వాక్‌లో రికార్డు
నాసాలో రెండో భారతీయ అమెరికన్ వ్యోమగామిగా గుర్తింపు పొందిన సునీతా విలియమ్స్ ఎన్నో ఘనతలను సొంతం చేసుకున్నారు.
ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత జాతీయ పతాకాన్ని గర్వంగా ఎగురవేశారు.
అంతేకాదు,ఒక మహిళా వ్యోమగామిగా 50 గంటల 40 నిమిషాలు స్పేస్ వాక్ చేసి ప్రపంచ రికార్డు సాధించారు.
భారతీయ మూలాలున్నప్పటికీ అమెరికాలో జన్మించిన సునీతా, తన మూలాలను మరచిపోలేదు.
అంతరిక్ష ప్రయాణంలో భగవద్గీత, ఉపనిషత్తులు తీసుకెళ్లడం గమనార్హం. ప్రస్తుతం నాసా కమర్షియల్ మార్స్ మిషన్‌లో ఆమె కీలక భూమిక పోషిస్తున్నారు.
వివరాలు
డాక్టర్ మధులికా గుహతాకుర్తా - సూర్యుని అధ్యయనం
డాక్టర్ మధులికా గుహతాకుర్తా ఢిల్లీ, డెన్వర్, కొలరాడో యూనివర్సిటీల్లో చదివి నాసాలో అంతరిక్ష పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
స్పేస్ క్రాఫ్ట్స్ కోసం పరికరాలు అభివృద్ధి చేయడంలో ఆమె ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాసా ప్రస్తుతం సూర్యుని పరిశీలన కోసం చేపట్టిన ప్రాజెక్టులో ఆమె సమర్థవంతమైన నేతృత్వాన్ని అందిస్తున్నారు.
త్వరలోనే సూర్యుడి దగ్గరకు ప్రయాణించనున్న నాసా మిషన్లలో ఆమె పాత్ర అగ్రస్థాయిలో ఉంది.
వివరాలు
స్వాతి మోహన్ - మార్స్ రోవర్ విజయంలో కీలక పాత్ర
ఇటీవల అత్యంత ప్రాచుర్యం పొందిన పేరు స్వాతి మోహన్. మార్స్‌పై పర్సెవరెన్స్ రోవర్ విజయవంతంగా ల్యాండ్ కావడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
అమెరికాకు వెళ్లిన ఆమె, నాసా జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2021లో నాసా చేపట్టిన "మార్స్ 2021" ప్రాజెక్టులో గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ ఆపరేషన్లకు నేతృత్వం వహించారు.
ఫిబ్రవరి 18న పర్సెవరెన్స్ రోవర్‌ను విజయవంతంగా ల్యాండ్ చేయడంలో ఆమె శ్రమించిన తీరు స్ఫూర్తిదాయకం.
వివరాలు
కల్పనా చావ్లా - తొలి భారతీయ మహిళా వ్యోమగామి
కల్పనా చావ్లా తొలి భారతీయ మహిళా వ్యోమగామిగా చరిత్రలో నిలిచిపోయారు.
హర్యానాలో జన్మించిన ఆమె, నాసాలో చేరి అంతరిక్ష పరిశోధనలో కీలక పాత్ర పోషించారు.
కొలంబియా స్పేస్ షటిల్‌లో రోబోటిక్ ఆర్మ్ ఆపరేటర్‌గా పనిచేశారు. అయితే 2003లో కొలంబియా స్పేస్ షటిల్ భూమికి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆమె మరణించారు.
అయినప్పటికీ, ఆమె పేరు ఇప్పటికీ అంతరిక్ష ఆరాధకులకూ, యువతకు ప్రేరణగా నిలుస్తోంది.
వివరాలు
షర్మిల భట్టాచార్య - అంతరిక్ష జీవనశాస్త్రంలో పరిశోధకురాలు
షర్మిల భట్టాచార్య నాసాలో అమెస్ రీసెర్చ్ సెంటర్ రీసెర్చ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
భారతీయ మూలాలున్న ఆమె, నైజీరియాలో జన్మించి ప్రిన్స్‌టన్ యూనివర్శిటీలో చదువుకున్నారు.
అంతరిక్ష యాత్రల సమయంలో జీవకణాలలో వచ్చే మార్పులు, రేడియేషన్ ప్రభావాలు వంటి అంశాలను పరిశోధిస్తున్నారు.
వివరాలు
డాక్టర్ అనితా సేన్ గుప్తా - మార్స్ రోవర్‌కు మార్గదర్శి
డాక్టర్ అనితా సేన్ గుప్తా, నాసాలో జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ ప్రాజెక్టు మేనేజర్‌గా ఉన్నారు.
మార్స్‌పై రోవర్లు సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా అనేక విధానాలను అభివృద్ధి చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
2012లో క్యూరియాసిటీ రోవర్‌ను మార్స్‌పై దిగేందుకు ఉపయోగించిన 70 అడుగుల పెద్ద ప్యారాచూట్ రూపకల్పన ఆమె చేసిన కృషి ఫలితం.
అంతేకాకుండా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో "బోస్ ఐన్‌స్టీన్ కండెన్సేట్" అనే ప్రత్యేక స్టేట్ ఆఫ్ మేటర్ రూపొందించడంలో కూడా ఆమె పాత్ర ఉంది.