
Apple iOS 26 Beta 8 : కొత్త ఫీచర్లతో వచ్చిన iOS 26 బీటా 8.. డౌన్‌లోడ్ చేసుకొనే విధానం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ఆపిల్ ఐఫోన్ యూజర్లకు శుభవార్త అందింది. తాజాగా కంపెనీ iOS 26 బీటా 8 అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఐఫోన్‌తో పాటు ఐప్యాడ్ కోసం కూడా iPadOS 26 బీటా 8 అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త బీటా వెర్షన్‌ను ముందుగా డెవలపర్‌ల కోసం రిలీజ్ చేశారు. త్వరలోనే పబ్లిక్ బీటా కూడా విడుదల అయ్యే అవకాశం ఉందని ఆపిల్ తెలిపింది. ఇదే సమయంలో macOS Tahoe 26 బీటా 8, అలాగే మిగిలిన OS 26 సూట్ బీటా 8 వెర్షన్‌లను కూడా రిలీజ్ చేసింది.
Details
కొత్త ఫీచర్లు ఇవే
iOS 26 'లిక్విడ్ గ్లాస్' ఇంటర్‌ఫేస్‌తో డిజైన్ మార్పులు ట్రాన్స్‌పరెంట్ ఎఫెక్ట్ లాక్ స్క్రీన్ కస్టమైజేషన్ మెసేజెస్ యాప్‌లో కస్టమ్ బ్యాక్‌గ్రౌండ్‌లు గ్రూప్ చాట్ పోలింగ్ ఆప్షన్ ఫోన్ యాప్, కార్‌ప్లే అప్‌గ్రేడ్స్ ఆపిల్ ఇంటెలిజెన్స్‌లో కొత్త ఫీచర్లు కొత్త రింగ్‌టోన్ ఆప్షన్లు అయితే, బీటా వెర్షన్ కావడంతో కొన్ని బగ్స్ ఉండే అవకాశముందని హెచ్చరించారు. అందువల్ల సాధారణ యూజర్లు వెంటనే ఇన్‌స్టాల్ చేయకుండా ఉండడమే మంచిదని సూచించారు. ఒకవేళ అప్‌డేట్ చేయాలనుకుంటే ముందుగా డేటా బ్యాకప్ తప్పనిసరి అని ఆపిల్ సూచిస్తోంది.
Details
iOS 26 బీటా 8 డౌన్‌లోడ్ & ఇన్‌స్టాల్ చేయాలంటే
1. ఐఫోన్‌లో Settings యాప్ ఓపెన్ చేయాలి 2. General > Software Update వెళ్లాలి 3. లేటెస్ట్ బీటా వెర్షన్ కనిపిస్తే Download & Install ట్యాప్ చేయాలి 4. ఇన్‌స్టాలేషన్ పూర్తయ్యాక ఫోన్ ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అవుతుంది ఇక మరోవైపు ఆపిల్ వచ్చే నెలలో iPhone 17 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్‌లో iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro, iPhone 17 Pro Max మోడల్స్ ఉంటాయని సమాచారం.