iPhone 15 vs Google Pixel 7 : ఐఫోన్ 15 వర్సెస్ గూగుల్ పిక్సెల్ 7.. బెస్ట్ మొబైల్ ఇదే..!
ఆపిల్ లవర్స్ ఎంతగానే ఎదురు చూసిన ఐఫోన్ 15 సిరీస్‌ను దిగ్గజ టెక్ సంస్థ ఇటీవలే లాంచ్ చేసింది. దీనికి మంచి డిమాండ్ లభిస్తుందని ఇప్పటికే టెక్ వర్గాలు పేర్కొన్నారు. ఈ తరుణంలో ఐ ఫోన్ 15ని గూగుల్ పిక్సెల్ 7తో పోల్చి ఈ రెండింట్లో బెస్ట్ ఏది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఐఫోన్ 15 సిరీస్‌లో డైనమిక్ ఐల్యాండ్‌ను అన్ని మోడల్స్ కు ఆపిల్ సంస్థ స్టాండర్ట్ గా ఇచ్చింది. ఇందులో 6.1 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్ డీఆర్ డిస్ ప్లే ఉండనుంది. అయితే యాపిల్ ప్రో -మోషన్ టెక్నాలజీ ఇందులో లేదు అంటే ఈ సిరీస్ కు 60 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ మాత్రమే లభించనుంది.
ఐఫోన్ 15 128 జీబీ ధర రూ.79,990
ఇక గూగుల్ పిక్సెల్ 7లో 90 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ తో పాటు కార్నరింగ్ గొరిల్లా గ్లాస్, 6.3 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుంది. ఐ ఫోన్ 15లో ఏ16 బయోనిక్ ఎస్ఓసీ చిప్‌సెట్, గూగుల్ పిక్సెల్ 7లో టెన్సార్ జీ2 ప్రాసెసర్, టిటానియం ఎం2 కో-ప్రాసెసర్ ఉండనున్నాయి. గూగుల్ పిక్సెల్ 7లో రేర్ లో 50 ఎంపీ ఆక్టా పీడీ క్వాడ్ బయర్, 12 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా ఉండనుంది. ఐ ఫోన్15లో డ్యుయెల్ కెమెరా సెటప్, 48 ఎంపీ ప్రైమరీ, 12 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా లైన్స్ వస్తున్నాయి. ఐఫోన్ 15 128 జీబీ ధర రూ.79,990 ఉండగా, గూగుల్ పిక్సల్ రూ.59,999గా ఉండనుంది.