Loading...
iPhone: ఐఫోన్ 16పై 35% తగ్గింపు.. ఐఫోన్ 17పై 25% తగ్గింపు..
ఐఫోన్ 16పై 35% తగ్గింపు.. ఐఫోన్ 17పై 25% తగ్గింపు..

iPhone: ఐఫోన్ 16పై 35% తగ్గింపు.. ఐఫోన్ 17పై 25% తగ్గింపు..

వ్రాసిన వారు Moogati Shabari
Aug 07, 2026
12:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడం సామాన్యుల బడ్జెట్‌పై రోజురోజుకూ భారంగా మారుతోంది. దీంతో ముఖ్యంగా మధ్యతరగతి భారతీయులు కొత్త ఫోన్లకు బదులుగా రీఫర్బిష్డ్ (పునరుద్ధరించిన) స్మార్ట్‌ఫోన్లను ఎంచుకుంటున్నారు. ఈ మార్పు కేవలం వినియోగదారుల ప్రవర్తనలోనే కాదు.. మార్కెట్ గణాంకాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ గణాంకాల ప్రకారం, 2026లో భారత్‌లో సెకండ్‌హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 12 శాతం వృద్ధి చెందే అవకాశం ఉంది. కొత్త స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ 11 శాతం మేర తగ్గే అవకాశముంది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు దేశంలో విక్రయమైన మొత్తం స్మార్ట్‌ఫోన్లలో రీఫర్బిష్డ్, ప్రీ-ఓన్డ్ ఫోన్ల వాటా 26 శాతానికి చేరింది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఈ వాటా సుమారు 23 శాతంగా ఉంది.

వివరాలు

మెమరీ చిప్‌ల ధరలు పెరుగుదల..

స్మార్ట్‌ఫోన్ల తయారీలో కీలకమైన మెమరీ చిప్‌ల ధరలు కూడా భారీగా పెరిగాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ల నుంచి పెరిగిన డిమాండ్ కారణంగా మెమరీ చిప్‌ల ధరలు రెండు నుంచి మూడు రెట్లు పెరిగినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో గత నవంబర్ నుంచి స్మార్ట్‌ఫోన్ల ధరలు గరిష్ఠంగా 70 శాతం వరకు పెరిగాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

సగటున చూస్తే ధరల పెరుగుదల 30-35 శాతం మధ్య ఉందని పరిశ్రమకు చెందిన అధికారులు అంచనా వేస్తున్నారు.

మంచి ఫోన్ కొనాలన్న ఆశతో ఇప్పటికే తమ బడ్జెట్‌ను పెంచుతున్న మధ్యతరగతి వినియోగదారులకు ఈ స్థాయి ధరల పెరుగుదల మరింత భారంగా మారుతోంది.

వివరాలు

ప్రీమియం ఫోన్లపై భారతీయుల ఆసక్తి తగ్గలేదు..

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వినియోగదారులు ఖరీదైన ఫోన్లను వదిలేసి తక్కువ ధర కలిగిన బేసిక్ లేదా ఎంట్రీ-లెవల్ మోడళ్లకు మారడం లేదు.

తమకు నచ్చిన, ఎప్పటి నుంచో కొనాలని అనుకుంటున్న ప్రీమియం ఫోన్‌నే తీసుకోవాలని కోరుకుంటున్నారు.

అయితే దాని కోసం కొత్త ఫోన్ ధర మొత్తాన్ని చెల్లించకుండా చౌకైన ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

కొత్త స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరగడానికి సరఫరా వ్యవస్థలో సమస్యలు, విడిభాగాల ధరలు పెరగడం వంటి కారణాలు ఉన్నాయని Grest సహ వ్యవస్థాపకుడు, CEO శ్రేయ్ సర్దానా తెలిపారు.

ఈ పరిణామాలు రీఫర్బిష్డ్ ఫోన్ల వైపు వినియోగదారుల మళ్లింపును మరింత వేగవంతం చేశాయని ఆయన పేర్కొన్నారు.

ADVERTISEMENT