
iPhone 17 series: ఐఫోన్ 17 సిరీస్ ధరల పెరుగుదలకు అవకాశం.. ఎంత ఉండొచ్చంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు సెప్టెంబర్ 9న మార్కెట్‌లో లాంచ్ కానున్నాయి. ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు మోడల్స్ ఉంటాయని సమాచారం. వీటిలో ఐఫోన్ 17,ఐఫోన్ 17 ఎయిర్,ఐఫోన్ 17 ప్రో,ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్స్ ఉండనున్నట్లు సమాచారం. గత సిరీస్ తో పోలిస్తే ఈసారి కొత్త మోడల్స్‌లో భారీ అప్‌గ్రేడ్లు ఉంటాయని,దాంతో ధరల పెరుగుదలకి అవకాశం ఉన్నట్లు టెక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇటీవల ఐఫోన్ 17,ఐఫోన్ 17 ప్రో మోడల్స్ యొక్క అమెరికా ధరలు లీక్ అయ్యాయి. లీక్ వివరాల ప్రకారం,గత మోడల్స్‌తో పోలిస్తే సుమారు $50 పెంపు ఉండవచ్చని తెలుస్తోంది.
వివరాలు
లీకైన వివరాలను బట్టి ఐఫోన్ 17 సిరీస్ ధరలు ఎంత ఉండొచ్చంటే..?
దీంతో ఈ సిరీస్‌లో వచ్చే ఫోన్లు కొంత ఎక్కువ ఖర్చుతో మార్కెట్‌లోకి రావచ్చని అంచనాలు ఉన్నాయి. ఐఫోన్ 17 128జీబీ వేరియంట్ ధర ఈసారి $849(సుమారు ₹84,990)ఉండే అవకాశం ఉంది. గత ఐఫోన్ 16 ప్రో ధర $999 గా ఉండగా,ఐఫోన్ 17 ప్రో ధర ఈసారి $1,049 (సుమారు ₹1,24,990) కి చేరవచ్చని సమాచారం ఉంది. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర $1,249 (సుమారు ₹1,50,000)కి పెరగవచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే,ఈ ధరలపై ఆపిల్ అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 9న రాత్రి 10.30 గంటలకు జరుగనుంది. ఈ ఈవెంట్‌ను Apple.com, Apple TV ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు.