
iPhone 17 Pro: భారీ కెమెరా,12GB ర్యామ్‌తో ఐఫోన్ 17 సిరీస్..సెప్టెంబర్‌లో లాంచ్ కానుంది..
ఈ వార్తాకథనం ఏంటి
ఆపిల్ అభిమానుల కోసం మరో కొత్త ఐఫోన్ సిరీస్ రానుంది. వచ్చే సెప్టెంబర్ నెల ప్రారంభంలో ఆపిల్ తన తాజా ఐఫోన్ 17 సిరీస్‌ను మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈసారి కంపెనీ పాత 'ప్లస్' మోడల్‌కు బదులుగా 'ఐఫోన్ 17 ఎయిర్' అనే సరికొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈసారి నాలుగు మోడల్స్: ఐఫోన్ 17 సిరీస్‌లో మొత్తం నాలుగు వేరియంట్లు ఉంటాయని తెలుస్తోంది. అవే: ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్
వివరాలు
ఈ నాలుగు మోడళ్లలో వచ్చే ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, అంచనా ధరలు…
ఐఫోన్ 17 లైనప్ - కెమెరా, డిజైన్, హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్స్: 24MP ఫ్రంట్ కెమెరా: ఈసారి ఐఫోన్ 17 సిరీస్‌లోని అన్ని మోడళ్లలో కూడా 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా రానుంది. ఇది గత ఐఫోన్‌లతో పోలిస్తే భారీ అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు. 8MP టెలిఫోటో కెమెరా: ఐఫోన్ 17 ప్రో,ప్రో మాక్స్ మోడళ్లకు 12MP కెమెరా స్థానంలో 48 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ రానుంది. దీని ద్వారా జూమ్ చేయడం,పోర్ట్రెయిట్ ఫోటోలు తీయడం మరింత క్వాలిటీగా మారనుంది. కంప్లీట్ డిజైన్ మార్పులు: ఐఫోన్ 17 ప్రో మోడల్ అల్యూమినియం ఫ్రేమ్‌తో వస్తోంది.బ్యాక్ ప్యానెల్ గాజు,మెటల్ మిశ్రమంతో హైబ్రిడ్ స్టైల్లో ఉంటుంది.కెమెరా సెక్షన్ దీర్ఘచతురస్రాకార ఆకృతిలో ఉండే అవకాశం ఉంది.
వివరాలు
ఈ నాలుగు మోడళ్లలో వచ్చే ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, అంచనా ధరలు…
సర్కులర్ కార్నర్లు దీన్ని మరింత ఆకర్షణీయంగా తయారు చేయనున్నాయి. శక్తివంతమైన చిప్‌సెట్ - A19 ప్రో: ఐఫోన్ 17 ప్రో సిరీస్ ఫోన్లు కొత్త A19 ప్రో చిప్‌పై పనిచేస్తాయి. ఇది TSMC తయారు చేసిన 3 నానోమీటర్ జెన్ 3 టెక్నాలజీతో రూపొందించబడింది. పనితీరు, పవర్ ఎఫిషియన్సీలో ఇది అత్యుత్తమంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. Wi-Fi 7 టెక్నాలజీ: ఇప్పటి వరకు వాడుతున్న బ్రాడ్‌కామ్ Wi-Fi మాడ్యూల్‌కి బదులుగా, ఆపిల్ స్వయంగా డిజైన్ చేసిన Wi-Fi 7 చిప్ సెట్‌ను ఈ సిరీస్‌లో ఉపయోగించనున్నారు. 12GB RAM: ఐఫోన్ 17 ఎయిర్, ప్రో మోడళ్లకు 12GB RAM ఉంటుంది. ఇది మల్టీటాస్కింగ్‌తో పాటు, కొత్తగా తీసుకొచ్చిన ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు సహాయపడుతుంది.
వివరాలు
భారత మార్కెట్లో ఐఫోన్ 17 ప్రో అంచనా ధర:
కొత్త ఫీచర్లు, అప్‌గ్రేడ్ల దృష్ట్యా ఐఫోన్ 17 ప్రో మోడల్ ధర గత మోడళ్లతో పోలిస్తే ఎక్కువగా ఉండే అవకాశముంది. ప్రస్తుత అంచనాల ప్రకారం, బేస్ వేరియంట్ ధర రూ. 1.5 లక్షల మార్కును దాటవచ్చు. అయితే అసలైన ధర, లభ్యతకు సంబంధించిన పూర్తి వివరాలు సెప్టెంబర్‌లో జరిగే ఆపిల్ అధికారిక లాంచ్ ఈవెంట్‌లో తెలియనున్నాయి. ఆ వరకు మరింత సమాచారం కోసం వేచి చూడాల్సిందే.