Iphone 18 Leaks: ఆపిల్ అభిమానులకు సూపర్ అప్డేట్..లీకైన ఐఫోన్ 18..ఫీచర్లు, డిజైన్,లాంచ్ తేదీ వివరాలపై భారీ అంచనాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆపిల్ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. త్వరలోనే iPhone 18 మార్కెట్లోకి రానుందన్న వార్త టెక్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 2025లో విడుదలైన iPhone 17 సిరీస్ పెద్ద హిట్ కావడంతో, ఇప్పుడు iPhone 18 పై యూజర్లలో భారీ ఎక్స్పెక్టేషన్లు ఏర్పడ్డాయి. ముఖ్యంగా iPhone 17 బేస్ వేరియంట్‌లో వచ్చిన అప్‌గ్రేడ్‌లు యూజర్లను బాగా ఆకట్టుకోవడంతో, రాబోయే మోడల్‌పై హైప్ మరింత పెరిగింది. ప్రస్తుతం లాంచ్‌కు ఇంకా సుమారు 10 నెలలు ఉన్నా, iPhone 18 కు సంబంధించిన లీక్స్, పుకార్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇక దీని ఫీచర్స్, ధర,లాంచ్ వివరాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.
వివరాలు
iPhone 18 ఎప్పుడు లాంచ్ అవుతుంది?
సాధారణంగా ఆపిల్ ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో కొత్త ఐఫోన్లు రిలీజ్ చేస్తుంది. అదే ట్రెండ్ కొనసాగితే, iPhone 18 కూడా వచ్చే ఏడాది సెప్టెంబర్‌లోనే లాంచ్ అయ్యే అవకాశం ఎక్కువ. ఇదివరకు వచ్చిన రిపోర్టుల ప్రకారం ఈసారి: iPhone 18 iPhone 18 Pro iPhone 18 Pro Max అలాగే iPhone Air 2 (కొత్తగా వచ్చే ఎయిర్ వెర్షన్) అనే నాలుగు మోడల్స్ వచ్చే అవకాశముంది. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది కానీ, సెప్టెంబర్ రెండో వారం మార్కెట్‌లోకి వచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఈ మోడల్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండొచ్చని సమాచారం.
వివరాలు
iPhone 18 కొంచెం ఎక్కువ ధరలో ఉండే ఛాన్స్
భారత మార్కెట్లో లాంచ్ & అంచనా ధర iPhone 18 సిరీస్ భారత మార్కెట్లో కూడా సెప్టెంబర్ నెలలోనే అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ధర విషయంలో.. iPhone 17 తో పోలిస్తే iPhone 18 కొంచెం ఎక్కువ ధరలో ఉండే ఛాన్స్ ఉంది. అంచనా ధర: సుమారు ₹85,000 నుండి ప్రారంభం కావొచ్చు. iPhone 18 డిజైన్, కెమెరా & స్పెసిఫికేషన్లు డిజైన్: ఆపిల్ ఇప్పటికే iPhone 17 సిరీస్‌లో కొన్ని డిజైన్ మార్పులు చేసింది. iPhone 18 లో కొత్త కలర్ ఆప్షన్లు కూడా రావచ్చని సమాచారం. కెమెరా: డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ (అధునాతన సెన్సారులతో) సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 18MP ఫ్రంట్ కెమెరా వచ్చే అవకాశముంది