
iPhone: ఐఫోన్ కొత్త అప్‌డేట్.. ఈ ఫీచర్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
ఆపిల్ ఫోన్ గురించి చెప్పడానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఆ కంపెనీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను చేస్తూ మార్కెట్లో నిరంతరం ముందుండిపోతుంది.
టెక్నాలజీ అభివృద్ధితో పాటు, వినియోగదారుల అవసరాలను తీర్చడానికి ఆపిల్ కొత్త ఫీచర్లను అందిస్తోంది.
ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఆపిల్ దాని కొత్త ఫీచర్ 'ఆపిల్ ఇంటలిజెన్స్'ను విడుదల చేసింది.
ఈ కొత్త ఫీచర్, యాపిల్ వినియోగదారులకు అనేక ఉపయోగాలు కలిగించేలా రూపొందించారు. తాజాగా ఆపిల్ తన సెకండ్ బ్యాచ్ అప్‌డేట్‌ను iOS 18.2, iPadOS 18.2, macOS Sequoia 15.2 పేరుతో విడుదల చేసింది.
Details
ఆపిల్ ఇంటలిజెన్స్ సపోర్ట్ చేసే డివైజ్‌లు
ఈ అప్‌డేట్స్ ఇప్పుడు ChatGPT (OpenAI ChatGPT) తో సమన్వయం చేసుకుంటూ 'సిరి', రైటింగ్ టూల్స్, ఇమేజ్ ప్లేగ్రౌండ్ వంటి ఫీచర్లను మెరుగుపరుస్తుంది.
iPhones : iPhone 15 Pro, iPhone 15 Pro Max, iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max
iPads : A17 చిప్ లేదా M1 చిప్‌తో పనిచేసే iPads తర్వాత వచ్చిన లేటెస్ట్ డివైజ్‌లు
Macs : M1 చిప్‌తో పాటు తర్వాత వచ్చిన Macs ఈ అప్‌డేట్‌లు
వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించనున్నాయి.