LOADING...
iPhone SE 4 Launch:ఆపిల్ వినియోగదారులకు గుడ్ న్యూస్..ఐఫోన్ SE 4 ఫోన్ లాంచ్ డేట్ ధ్రువీకరించిన టిమ్‌ కుక్‌!
ఐఫోన్ SE 4 ఫోన్ లాంచ్ డేట్ ధ్రువీకరించిన టిమ్‌ కుక్‌!

iPhone SE 4 Launch:ఆపిల్ వినియోగదారులకు గుడ్ న్యూస్..ఐఫోన్ SE 4 ఫోన్ లాంచ్ డేట్ ధ్రువీకరించిన టిమ్‌ కుక్‌!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 14, 2025
03:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెక్ ప్రేమికులు ఐఫోన్‌ ఎస్‌ఈ (iPhone SE) సిరీస్‌లో నాలుగో తరం మోడల్ కోసం చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెగ్యులర్‌ ఐఫోన్ల కంటే తక్కువ ధరలో లభించడం దీని ప్రధాన ఆకర్షణ.ఈ నేపథ్యంలో,ఆపిల్ నుంచి త్వరలోనే కొత్త ప్రొడక్ట్‌ మార్కెట్లోకి రానుందని సమాచారం. ఆపిల్ సీఈఓ టిమ్‌ కుక్‌ (Tim Cook) 'ఎక్స్‌' వేదికగా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఫిబ్రవరి 19న యాపిల్‌ నుంచి ఎస్‌4 సిరీస్‌ విడుదల కానుందని ఆయన తెలిపారు. వెండి రంగులో మెరిసే యాపిల్‌ లోగోను షేర్‌ చేశారు. ఎలాంటి ప్రొడక్ట్‌ను ప్రకటించనున్నారన్న వివరాలను వెల్లడించనప్పటికీ, ఇది ఐఫోన్‌ ఎస్‌ఈ నాలుగో తరం మోడల్‌ అయ్యే అవకాశముందని టెక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వివరాలు 

ఆపిల్ ఎస్‌ఈ 4 ఫీచర్లు - ఏముందంటే? 

"మా కుటుంబంలో కొత్త మెంబర్‌ రాబోతున్నారు"అని టిమ్‌ కుక్‌ చెప్పడం దీనికి బలం చేకూరుస్తోంది. ఆపిల్ ఐఫోన్‌ ఎస్‌ఈ(iPhone SE)సిరీస్‌కు ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది. 2022లో చివరిసారిగా ఎస్‌ఈ మోడల్‌ను లాంచ్‌ చేయగా,దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ కొత్త వర్షన్‌ రానుంది. ప్రధాన అంచనాలు: ఐఫోన్‌ 14 తరహాలో హోమ్‌ బటన్‌,టచ్‌ ఐడీ లేకుండా ఫేస్‌ ఐడీ ఫీచర్‌తో లాంచ్ అయ్యే అవకాశం. ఆపిల్ ఇంటెలిజెన్స్‌ ఇంటిగ్రేషన్ ఉండొచ్చు. యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్ కలిగి ఉండే అవకాశం. ఏ18 చిప్‌సెట్‌తో మరింత శక్తివంతమైన పనితీరు అందించనుంది. ధర:బేస్ వేరియంట్‌ను సుమారు ₹43,900ధరలో అందించే అవకాశం. ఐఫోన్ ఎస్‌ఈ 4 విడుదలపై అధికారిక ప్రకటన కోసం టెక్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది!