Page Loader
iQOO 13 5G: సూపర్ ఫీచర్లతో రాబోతున్న iQOO 13..
సూపర్ ఫీచర్లతో రాబోతున్న iQOO 13..

iQOO 13 5G: సూపర్ ఫీచర్లతో రాబోతున్న iQOO 13..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2024
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్ర‌ముఖ టెక్ బ్రాండ్ ఐక్యూ (iQOO) దేశ‌వ్యాప్తంగా మాత్ర‌మే కాదు, ప్ర‌పంచ‌వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది. సరికొత్త ఫోన్లను ప్ర‌వేశ‌పెడుతూ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఇప్ప‌టికే అనేక రకాల ఫోన్ల‌ను లాంచ్ చేసిన ఈ కంపెనీ తాజాగా మ‌రొక ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. చైనాలో ప్రారంభమైన iQOO 13 ఫోన్ త్వరలో భారతదేశంలో అందుబాటులోకి రానున్న‌ట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుందని తెలిపింది.

వివరాలు 

ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్

భార‌త మార్కెట్‌లో ఐక్యూ 13 లాంచ్ తేదీ ఇంకా ప్రకటించలేదు.ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్స్ గురించి చూస్తే,క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌,16GB RAM + 1TB స్టోరేజ్,32MP సెల్ఫీ కెమెరా,50MP రియర్ కెమెరా, 6,150mAh బ్యాటరీ,120W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. డిస్ప్లే విషయానికి వస్తే, iQOO 13 లో 6.82 అంగుళాల 2K ఫుల్ HD+ డిస్ప్లే ఉండి, 3168 x 1440 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఇది BOE 8T LTPO 2.0 స్క్రీన్‌,OLED Q10 ప్యానెల్ మీద నిర్మించబడింది.ఈ డిస్ప్లే144Hz రిఫ్రెష్ రేట్‌, 1800 నిట్స్ బ్రైట్నెస్‌,2592Hz PWM డిమ్మింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా,ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్ కూడా ఉంది.

వివరాలు 

4.32 GHz స్నాప్‌డ్రాగన్ 8 లైట్ ప్రాసెసర్‌

iQOO 13 ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 5 ఆపరేటింగ్ సిస్టమ్ పై ర‌న్ అవుతుంది. 4.32 GHz స్నాప్‌డ్రాగన్ 8 లైట్ ప్రాసెసర్‌తో ఇది వేగంగా ప‌నిచేస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP సోనీ IMX921 OIS ప్రధాన సెన్సార్‌, 50MP శామ్సంగ్ S5KJN1 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌, 50MP సోనీ IMX816 టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే, iQOO 13 సిలికాన్ యానోడ్ టెక్నాలజీ ఆధారంగా నిర్మించిన 6,150mAh బ్యాటరీని కలిగి ఉంది.

వివరాలు 

120W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ

ఈ స్మార్ట్‌ఫోన్‌ 120W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. iQOO 13 IP69 సర్టిఫికేట్ పొందింది, అంటే ఇది వాటర్ ప్రూఫ్‌, డస్ట్ ప్రూఫ్‌. కనెక్టివిటీ ఎంపికలలో వై-ఫై 7, బ్లూటూత్ వర్షన్ 5.4 ఇంకా ఎన్ఎఫ్సి ఉన్నాయి. చైనాలో మొత్తం ఐదు వేరియంట్లలో విడుదలైన ఈ ఫోన్ ధర రూ. 47,200 నుంచి రూ. 61,400 వరకు ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

iQOO India చేసిన ట్వీట్