iQOO 15R: గేమర్ల కోసం ఐకూ 15R ఎంట్రీ.. భారీ బ్యాటరీ, తగ్గిన ధర
ఈ వార్తాకథనం ఏంటి
గేమింగ్ ప్రియుల కోసం ఐకూ నుంచి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ విడుదలైంది. ఐకూ 15 సిరీస్‌లో భాగంగా iQOO 15R ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో పాటు 7,600 ఎంఏహెచ్ సామర్థ్యం గల భారీ బ్యాటరీని ఈ ఫోన్‌లో అందించారు. ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లతో వచ్చిన ఈ డివైస్ ధర, స్పెసిఫికేషన్లు తదితర వివరాలు ఇలా ఉన్నాయి.
వివరాలు
iQOO 15R ప్రత్యేకతలు
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6 పై పనిచేస్తుంది. దీనికి నాలుగేళ్లపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, ఆరేళ్లపాటు భద్రతా అప్‌డేట్లు అందిస్తామని సంస్థ హామీ ఇచ్చింది. 6.59 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేటుతో అందించారు. గరిష్టంగా 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ ఉంది. హెచ్‌డీఆర్10 సర్టిఫికేషన్‌తో పాటు గేమింగ్ సమయంలో 144Hz రిఫ్రెష్ రేటును సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌ను అమర్చారు. ఫోటోగ్రఫీ పరంగా వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్‌వైటీ 700వీ ప్రధాన కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో అందించారు.
వివరాలు
iQOO 15R ధర వివరాలు
అదనంగా 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ ఉంది. సెల్ఫీల కోసం ముందు వైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను ఇచ్చారు. వైఫై 7, బ్లూటూత్ 6, టైప్-సీ పోర్ట్, ఐపీ68 మరియు ఐపీ69 రేటింగ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 7,600 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించారు. ఐకూ 15ఆర్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.50 వేలకుపైగా ఉంటుందని భావించినప్పటికీ, కంపెనీ తక్కువ ధరలోనే విడుదల చేసింది. 8జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ.44,999 12జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ.47,999 12జీబీ + 512జీబీ వేరియంట్ ధర రూ.52,999
వివరాలు
మార్చి 3 నుంచి విక్రయాలు
డార్క్ నైట్, ట్రయంఫ్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. అమెజాన్, ఐకూ ఇండియా వెబ్‌సైట్, వివో రిటైల్ స్టోర్లలో నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మార్చి 3 నుంచి విక్రయాలు మొదలవుతాయి. హెచ్‌డీఎఫ్‌సీ,యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.4,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అదనంగా రూ.1,899 విలువ చేసే ఐకూ లేదా వివో టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్‌లను ఉచితంగా అందిస్తున్నారు.