LOADING...
WhatsApp: మీ వాట్సాప్ అకౌంట్ సురక్షితమేనా.. స్కామ్‌లను ఎలా చెక్ పెట్టాలో తెలుసా?
మీ వాట్సాప్ అకౌంట్ సురక్షితమేనా.. స్కామ్‌లను ఎలా చెక్ పెట్టాలో తెలుసా?

WhatsApp: మీ వాట్సాప్ అకౌంట్ సురక్షితమేనా.. స్కామ్‌లను ఎలా చెక్ పెట్టాలో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2026
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాట్సాప్‌లో మోసాల ముప్పు రోజురోజుకీ కొత్త రూపం దాలుస్తోంది. గతంలో అనుమానాస్పద సందేశాలకే పరిమితమైన స్కామ్‌లు ఇప్పుడు సైలెంట్ మాల్వేర్ డెలివరీ, నకిలీ కాల్స్‌, ట్రాకింగ్ లింక్స్‌ వరకు విస్తరించాయి. యూజర్ ఏ క్లిక్ చేయకుండానే అకౌంట్‌ ప్రమాదంలో పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి వాట్సాప్‌ కొత్తగా 'స్ట్రిక్ట్ అకౌంట్ సెట్టింగ్స్' (Strict Account Settings) ను ప్రవేశపెట్టింది.

Details

2026లో అమల్లోకి వచ్చిన కొత్త భద్రతా ఫీచర్లు

2026 ప్రారంభంలో వాట్సాప్‌ రోల్‌అవుట్ చేసిన ఈ కొత్త భద్రతా వ్యవస్థ ద్వారా ఫిషింగ్‌, స్పైవేర్‌, నకిలీ గుర్తింపు (ఇంపర్సనేషన్) స్కామ్‌లను గణనీయంగా తగ్గించాలన్నది సంస్థ లక్ష్యం. తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌, మాలిషియస్ అటాచ్‌మెంట్లు, స్పూఫ్‌డ్ కాల్స్‌ వంటి ప్రమాదాలను ముందుగానే అడ్డుకునేలా ఈ సెట్టింగ్స్‌ రూపొందించారు.

Details

స్ట్రిక్ట్ అకౌంట్ సెట్టింగ్స్‌లో ఉన్న ప్రధాన రక్షణలు

తెలియని కాంటాక్ట్స్‌ పంపే ఫోటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కాకుండా బ్లాక్ అనుకోని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను సైలెంట్ చేయడం ప్రొఫైల్ ఫోటో, లాస్ట్ సీన్‌, స్టేటస్ వంటి వివరాలను అపరిచితులకు కనిపించకుండా దాచడం అకౌంట్ సెట్టింగ్స్ మార్చాలంటే తప్పనిసరిగా 'PIN' అవసరం. 'PIN' లేకుండా ఎలాంటి మార్పులు చేయలేని అదనపు భద్రతా లేయర్ ఈ సెట్టింగ్స్ డిఫాల్ట్‌గా తెలియని యూజర్లు మీతో సంప్రదించకుండా అడ్డుకుంటాయి. దీని వల్ల యూజర్ ఎటువంటి చర్య తీసుకోకపోయినా జరిగే సైలెంట్ అటాక్స్‌ను కూడా నియంత్రించవచ్చని వాట్సాప్ పేర్కొంది.

Advertisement

Details

స్కామ్‌లు ఎలా మారుతున్నాయి?

ఇప్పటి స్కామర్లు కేవలం సందేశాలకే పరిమితం కావడం లేదు. యూజర్ ఎలాంటి క్లిక్ చేయకుండానే ట్రాకింగ్ లింక్స్‌, మాల్వేర్ ఫైళ్లు అకౌంట్‌లోకి ప్రవేశించేలా వ్యూహాలు మారాయి. దీనితో అసలు ప్రమాదాన్ని గుర్తించేలోపే నష్టం జరిగే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్ట్రిక్ట్ సెట్టింగ్స్ ఎలా ఆన్ చేయాలి? ఈ ఫీచర్ ఉపయోగించాలంటే వినియోగదారులు తమ వాట్సాప్‌ను 2026 లేటెస్ట్ వెర్షన్‌కు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్ట్రిక్ట్ ప్రొటెక్షన్ ఆప్షన్‌ను యాక్టివేట్ చేయాలి. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త భద్రతా వ్యవస్థతో స్కామ్‌లను అడ్డుకోవడంలో వినియోగదారులకు మరింత రక్షణ లభించనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement