
మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. జులైలో చంద్రయాన్-3 ప్రయోగం
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)మరో ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1ని ప్రయోగించాలని అంతరిక్ష సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
చంద్రయాన్ 3 అనేది చంద్రుడి మీద ఇస్రో ప్రయోగించే మూడవ మిషన్. ఆదిత్య ఎల్ 1 సూర్యుడి సంబంధిత పరిశోధనల కోసం ఇస్రో ప్రయోగించబోయే మొదటి మిషన్. ఈరెండు ప్రయోగాలను వచ్చే జులై మొదటి వారంలో ప్రవేశపెట్టున్నారు.
2019లో చంద్రయాన్ 2ని ప్రయోగించారు. కానీ ఆ ప్రయోగం విఫలమైంది. చంద్రుడి ఉపరితలం మీద దిగేటప్పుడు ల్యాండర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ప్రయోగం సక్సస్ కాలేదు.
చంద్రయాన్ 2 మాదిరిగానే చంద్రయాన్ 3లో కూడా ల్యాండర్, రోవర్ ను ఏర్పాటు చేశారు. చంద్రయాన్ 3లో ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగి రసాయనిక విశ్లేషణ చేయనుంది.
Details
సూర్యుడిపై ఇస్రో చేస్తున్న మొదటి ప్రయోగం
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ చంద్రయాన్-3 ప్రయోగించనున్నారు. ఈ మిషన్‌కు దాదాపు రూ. 613 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. ఇస్రో ప్రతిష్టాత్మకంగా సూర్యడిపై చేపడుతున్న మరో ప్రయోగం ఆదిత్య ఎల్1. ఇది భానుడిపై ఇస్రో చేస్తోన్న మొదటి ప్రయోగం.
ఆదిత్య ఎల్ 1ను సూర్యుడి కక్ష్యలో ఎల్ 1 పాయింట్ చుట్టూ భూమికి సూర్యుడి మధ్య ప్రవేశపెట్టున్నారు. దీంతో సౌర వాతావరణం, సౌర అయస్కాంత తుఫానులు, భారత్ పై వాటి ప్రభావాన్ని తెలుసుకొనే అవకాశం ఉంటుంది.
ఇది భూమి నుండి సూర్యుని వైపు 1.5 మిలియన్ కిమీ దూరంలో ఉన్న ఎల్1 పాయింట్ చుట్టూ కక్ష్యలో చేర్చనున్నారు.